జాతీయ వార్తలు

పార్లమెంట్‌లో సమస్యలు లేవనెత్తుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్‌లో రైతులు, భవన కార్మికుల ఆత్మహత్యలు, రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ వెల్లడించింది. ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్లమెంటరీ నాయకుడు గల్లా జయ్‌దేవ్, పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు కనకమేడల రవీంద్రకుమార్ పాల్గొన్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన అంశా లు పెండింగ్‌లో వున్నాయని, వాటిని పరిష్కరించాలని కేంద్రాన్ని కోరామని అన్నా రు. దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, కోనుగోలు శక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిస్థితులు మారిపోయాయని, రైతులు, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, రాష్ట్రంలో తిరోగమన పాలన సాగుతోందని.. వాటిపై పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తుతామని అన్నారు. సభలో పార్టీలకు కేటాయించే సమయాన్ని పెంచాలని కోరామని, బిల్లుపై చర్చ విషయంలో చిన్న పార్టీలకు రెండు మూడు నిమిషాలు సమయం కేటాయించడంతో సభ్యులు సరైన అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతున్నారని అఖిలపక్ష దృష్టికి తీసుకెళ్లామన్నారు.
లోక్‌సభ, రాజ్యసభ టివీలను విలీనం చేస్తారని వార్తలు వచ్చాయని, అది సరైన నిర్ణయం కాదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు.