జాతీయ వార్తలు

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: భారత్ తన దేశంలోని యువతకు వెన్నుదన్నుగా నిలవాల్సిన సమయమిదని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకునేందుకు వీలుగా కృషి చేయవలసిన అవసరముందని యునిసెఫ్ చీఫ్ హెన్రియెట్టా హెచ్ ఫోర్ పేర్కొన్నారు. యునిసెఫ్ ఇటీవల నీతి ఆయోగ్‌తో కలిసి ‘యువాహ్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. యువతలో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా 300 మిలియన్ల మందికి పైగా భారతీయ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ‘యువాహ్’ లక్ష్యం. ఈ నేపథ్యంలో ఫోర్ ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘్భరత్‌లో ప్రతి నెల ఒక మిలియన్ ఉద్యోగాలు సృష్టించవలసిన అవసరం ఉంది’ అని అన్నారు. భారత్‌లోని ప్రతి యువతీ యువకుడిని ‘యువాహ్’ చేరుకుంటుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ‘్భరత్ గట్టిగా నిలబడాల్సిన సమయమిది. ప్రపంచం గట్టిగా నిలబడాల్సిన సమయమిది. భారత్ తన యువతీయువకులు భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన ఉద్యోగాలను, జీవనోపాధిని, విద్యను అందుకునేందుకు దోహదపడే చైతన్యాన్ని వారిలో తీసుకురాగలదు. దాని ఫలితాలు ప్రపంచంలో కనిపిస్తాయి. భారత్ సరయిన దిశలోనే సాగుతోంది’ అని ఫోర్ పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ప్రాబల్యం కనబరుస్తున్న సేవారంగంలో యువతకు నైపుణ్యాలను పెంపొందించవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు. ‘గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొన్ని ఆందోళనలు నెలకొని ఉన్నాయని నేను భావిస్తున్నాను. గ్రామీణ యువత వ్యవసాయ క్షేత్రాల్లో ఉండాలని కోరుకోవడం లేదు.