జాతీయ వార్తలు

రైతులకు ఎకరాకు రూ. 2,500 ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, నవంబర్ 17: పంట వ్యర్థాలను తగులబెట్టకుండా ఉండేందుకు ఎకరానికి రెండు వేల 500 రూపాయిల చొప్పున రైతులకు అందజేయాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా ఆదివారం డిమాండ్ చేశారు. చిన్న, మధ్యతరహా రైతులకు ఈ విధంగా ప్రభుత్వం అందజేస్తే పంటలను తగులబెట్టడమనే సమస్య ఉత్పన్నం కాదని హితవు పలికారు. పంజాబ్ ప్రభుత్వం ఇస్తున్నట్లుగానే హర్యానా ప్రభుత్వం కూడా రైతులకు పరిహారంగా చెల్లించాలని కాంగ్రెస్ నేత హూడా స్పష్టం చేశారు. తన స్వస్థలమైన రోహ్‌తక్‌లో సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ హర్యానా ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన ఎకరాకు వెయ్యి రూపాయిలు ఏమాత్రం సరిపోదని.. పంజాబ్ ప్రభుత్వం ఇస్తున్నట్లుగానే రెండు వేల 500 చొప్పున ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాయు కాలుష్యానికి కేవలం రైతులు పంటల వ్యర్థాలను తగులబెట్టడమే కారణం కాదని ఆయన విశదీకరించారు. ‘దీనికి ఎన్నో కారణాలున్నాయి.. వరి గడ్డిని తగులబెట్టడమనేది ఒక కారణం మాత్రమే.. వాహనాల పొగ నుంచి కాలుష్యం వెలువడుతోంది.. అలాగే, పరిశ్రమలు, నిర్మాణ రంగం ఎన్నో రంగాల కారణంగా కాలుష్యం వెలువడుతోంది.. దీనికి ఒక్క రైతును మాత్రమే లక్ష్యం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు’ అని హూడా స్పష్టం చేశారు.