జాతీయ వార్తలు

‘పొగమంచు సెలవులు’ ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో గల పాఠశాలల్లో ప్రతి సంవత్సరం నవంబర్ ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు పొగమంచు కారణంగా (స్మాగ్ బ్రేక్) సెలవులు ప్రకటిస్తూ షెడ్యూలును విడుదల చేయాలని 70 శాతానికి పైగా తల్లిదండ్రులు కోరుతున్నారని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలోని సుమారు పది వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ‘పొగమంచు సెలవుల’ కారణంగా నష్టపోయిన పని దినాలను వేసవి, శీతాకాల, ఇతర సెలవులను తగ్గించడం ద్వారా భర్తీ చేయాలని వారు కోరారు. దీనివల్ల విద్యాసంవత్సరం మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం పడబోదని వారు పేర్కొన్నారు. ‘్ఢల్లీ, ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా, గుర్గావ్‌లలోని 74 శాతం మంది తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం నవంబర్ ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని, అందువల్ల ఈ తేదీల మధ్య ప్రతి సంవత్సరం పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని కోరారు’ అని ‘లోకల్‌సర్కిల్స్’ అనే ఆన్‌లైన్ వేదిక నిర్వహించిన సర్వేలో తేలింది. నవంబర్ నెలలో పాఠశాలలకు తరచుగా సెలవులు ప్రకటించడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థుల పాఠ్యాంశాల బోధన పూర్తికావడం లేదని పేర్కొన్నారు. అందువల్ల నవంబర్ నెలలో ‘పొగమంచు సెలవులను’ షెడ్యూలు ప్రకారం ప్రకటించి, ఇలా నష్టపోయిన పనిదినాలను ఇతర సెలవులను తగ్గించడం ద్వారా భర్తీ చేయాలని వారు కోరుతున్నారని సర్వే నివేదిక వెల్లడించింది.