జాతీయ వార్తలు

ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 16: మహారాష్టలో రాష్ట్రపతి పాలనను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యేలను కొనుగోలుకు బీజేపీ ప్రయత్నిస్తోందని శివసేన తీవ్ర ఆరోపణలు చేసింది. శనివారం శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. శివసే-ఎన్‌సీపీ- కాంగ్రెస్ ఏర్పాటు చేసే ప్రభుత్వం మహాఅయితే ఆర్నెల్లు ఉంటుందని ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై సేన మండిపడింది.‘ కొత్త కూటమిని చూస్తే కొందరికి కడపుమంటగా ఉంది’అని విమర్శించారు. త్వరలోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, 119 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ శుక్రవారం ప్రకటించారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ బలం 105 అని అలాంటప్పుడు 119 మంది ఎక్కడ నుంచి వస్తారని శివసేన నిలదీసింది. గవర్నర్ ఆహ్వానించినా తగిన బలం లేదని ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకురాని బీజేపీకి అమాంతంగా బలం ఎలా పెరుగుతుందని సామ్నాలో ప్రశ్నించారు. పాటిల్ ప్రకటనను బట్టే బేరసారాలు ఉంటాయన్న సంగతి అర్థమవుతోందని అన్నారు. శాసన సభ్యులను కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని చూస్తున్న బీజేపీ పారదర్శక పాలన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని సేన ధ్వజమెత్తింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రానందున రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్‌సింగ్ కొషియారీ సిఫార్సు చేయడం, కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగిపోయింది. సీఎం పదవి 50:50 ఫార్ములాకు శివసేన ప్రతిపాదించగా బీజేపీ తిరస్కరించింది. దీంతో ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన ఒప్పించింది. గత నెలలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసే పోటీ చేశాయి. బీజేపీకి 105, శివసనేకు 56 సీట్లు వచ్చాయి. కాగ్రెస్-ఎన్‌సీపీ కూటమికి 44,54 సీట్లు దక్కాయి. ఇలా ఉండగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీపైనా సామ్నాలో తీవ్ర విమర్శలు చేశారు. ఇదొక క్రికెట్ వ్యవహారమని గడ్కరీ పేర్కొనడాన్ని సేన ఎద్దేవా చేసింది. ‘గడ్కరీకి క్రికెట్ రంగంతో సంబంధం లేదు. సిమెంట్, ఇథినల్, తారు మిగతా వాటి గురించి బాగా తెలుసు’అని సామ్నాలో చురకలంటించారు. మహారాష్ట్ర సంక్షోభంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి గడ్కరీ రాజకీయాలకు క్రికెట్‌కు లింకుపెట్టి మాట్లాడారు. రెంటిలోనూ ఎప్పుడు ఏదైనా జరగొచ్చని, మ్యాచ్ అన్నాక ఎవరో ఒకరు గెలవ వచ్చని అన్నారు. క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌లు, కొనుగోళ్లు ఉంటాయని అలాంటివే ఇక్కడ జరుగుతాయన్న ఉద్దేశంతోనే నితిన్ గడ్కరీ ఆ వ్యాఖ్యలు చేశారని శివసేన విమర్శించింది.
ఎన్‌డీఏ సమావేశానికి సేన దూరం
రాజధాని ఢిల్లీలో ఆదివారం జరిగే ఎన్‌డీఏ మిత్ర పక్షాల సమావేశానికి శివసేన హాజరుకావడం లేదని పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ప్రకటించారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా ఎన్‌డీఏ పక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే జయంతి ఉన్నందున ఢిల్లీ భేటీకి హాజరుకాలేమని రౌత్ వెల్లడించారు. శివసేన నుంచి ఎవరూ ఎన్‌డీఏ సమావేశానికి హాజరుకారని ఆయన స్పష్టం చేశారు. సేన చీఫ్ ఉద్ధవ్ థాకరేను ఆయన నివాసంలో కలిసిన రౌత్ తరువాత మీడియాకు ఈ విషయం వెల్లడించారు. సీఎం పదవి విషయంలో బీజేపీతో సంబంధాలు తెగతెంపులు చేసుకున్న శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్‌సీపీ- కాంగ్రెస్‌తో చర్చల్లో తలమునకలై ఉంది. రాజకీయ ప్రత్యర్థులైన ఎన్‌సీపీ-కాంగ్రెస్‌తో కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ) ఖరారు చేసింది. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తరువాతే కేంద్ర కేబినెట్‌లో ఉన్న అరవింద్ సావంత్‌తో సేన రాజీనామా చేయించింది.