జాతీయ వార్తలు

రాష్ట్ర సమస్యలను లేవనెత్తుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: రాష్రానికి సంబంధించిన పలు సమస్యలను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని వైసీపీ లోక్‌సభా పక్ష నాయకుడు మిథున్‌రెడ్డి వెల్లడించారు. లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అధ్యక్షతన పార్లమెంట్‌లో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ లోక్‌సభా పక్ష నాయకుడు మిథున్‌రెడ్డి, టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ నెల 18 నుంచి ప్రారంభకానున్న సమావేశాలకు సహకరించాలని లోక్‌సభా పక్ష నాయకులను స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా విజ్ఞప్తి చేశారు. అనంతరం మిథున్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు తమ పార్టీ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలతోపాటు విభజన అంశాలపై మాట్లాడేందుకు సమయం కావాలని స్పీకర్‌ను కోరినట్టు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి విద్యా సంస్థలు, కడప స్టీల్‌ప్లాంట్, రామాయపట్నం పోర్టు సహా కేంద్ర నుంచి రావాల్సిన అంశాలన్నీ పార్లమెంట్‌లో లేవనెత్తుతామని మిథున్‌రెడ్డి వెల్లడించారు.
విభజన అంశాలు లేవనెత్తుతాం: నామా
విభజన సమయంలో ఇచ్చిన హామీలతోపాటుగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ సమావేశాల్లో కేంద్రం 27 బిల్లులను తీసుకురాబోతుందని అన్నారు. కేంద్రం తీసుకువచ్చే బిల్లులతోపాటుగా రాష్ట్రాల అంశాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరినట్టు చెప్పారు. అన్ని విషయాలపై చర్చించేందుకు సమయం ఇస్తామని స్పీకర్ హామీ ఇచ్చినట్టు చెప్పారు. రాష్ట్రాల అసెంబ్లీలో ఉన్న అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తేందుకు లోక్‌సభ సభ్యులకు అవకాశం ఇవ్వవద్దని స్పీకర్‌ను కోరినట్టు చెప్పారు.
*చిత్రం... అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నామా నాగేశ్వరరావు, మిథున్‌రెడ్డి