జాతీయ వార్తలు

‘మహా’ వ్యూహంపై కదలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 16: మహారాష్టల్రో శివసేనతో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై చర్చించేందుకు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆదివారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలుసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశం వాయిదా పడేందుకే ఎక్కువ అవకాశం ఉందని అందుకు కారణం ఆదివారం పూణేలో ఎన్సీపీ కోర్ కమిటీ సమావేశాన్ని పవార్ ఏర్పాటు చేయడమేనని చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, ఎన్సీపీ శివసేనతో చేతులు కలిపి సర్కారును ఏర్పాటు చేయడానికి వీలుగా కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కనీస ఉమ్మడి కార్యక్రమ ముసాయిదాపైన అలాగే ఈ మూడు భాగస్వామ్య పక్షాల మధ్య ఏవిధంగా మంత్రి పదవులను కేటాయించలన్న దానిపైనా సోనియాతో పవార్ చర్చిస్తారని ఈ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాష్టప్రతి పాలన లో ఉన్న మహారాష్టల్రో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఈ మూడు పార్టీలు గత రెం డు మూడు రోజులుగా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కలసి పోటీ చేసిన బీజేపీ, శివసేన మధ్య పదవుల పంపకంపై విభేదాలు తలెత్తిన పరిస్థితి అంతిమంగా రాష్టప్రతి పాలనకు దారితీసిం ది. తమకు సీఎం పదవి ఇవ్వాలని శివసేన పట్టుబట్టడమే బీజేపీతో వివాదాలకు కారణమైంది. తాజాగా, కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న ‘సేన’ డిమాండ్ చేసే పదవులు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా, ఆదివారం సాయంత్రం సోనియా, పవార్ మధ్య ఢిల్లీలో భేటీ జరుగుతుందని ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. శివసేన, ఎన్సీపీ ఏర్పాటు చేసే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇవ్వడం కాకుండా ఈ సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలుపంచుకోవాలని ఎన్సీపీ కోరుతోంది. ఈ కూటమి ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగే అవకాశం ఉంటుందని ఎన్సీపీ వర్గాలు పేర్కొన్నాయి.
*ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ , కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (ఫైల్‌ఫొటో)