జాతీయ వార్తలు

రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల ముందు శనివారం బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ భువనేశ్వర్‌లో నాయకత్వం వహించారని ఆ పార్టీ ఒక ప్రకటన లో తెలిపింది. ముంబయిలో పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, బిహార్‌లో సంజ య్ జైశ్వాల్ ఈ నిరసన ప్రదర్శనలకు సారథ్యం వహించారని తెలిపింది. లక్నో, చండీగఢ్, సిమ్లా, జైపూర్, వారణాసి, తిరువనంతపురంలలో ఈ ప్రదర్శనలు జరిగాయని బీజేపీ వివరించింది.
*చిత్రం...రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా శనివారం ముంబయిలో బీజేపీ కార్యకర్తల నిరసన ప్రదర్శన