జాతీయ వార్తలు

లక్ష్మణ రేఖను దాటొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 16: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ మధ్య వివాదాల వేడి అడపాదడపా రగులుకుంటూనే ఉంది. తాజాగా, ప్రభుత్వ తీరుపై శనివారంనాడు మండిపడ్డ గవర్నర్ ‘లక్ష్మణ రేఖను ఎవరూ అతిక్రమించడానికి వీల్లేదు’ అని స్పష్టం చేశారు. రాష్ట్ర గవర్నర్‌గా రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారమే తాను నడుచుకుంటున్నానని, ఏ నిర్ణయాలు తీసకోవాలో వేటిని తీసుకోకూడదో తనకు బాగా తెలుసుకునని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు. తానే కాదు, ఎవరూ కూడా ఈ రకమైన రాజ్యాంగ పరిమితులను దాటడానికి వీల్లేదని తెలిపారు. ఈ ఏడాది జూలైలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ధన్‌కర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆయనకు మధ్య అనేక అంశాలపై వివాదాలు చెలరేగుతూనే వచ్చా యి. అనేక సందర్భాల్లో వీరిద్దరూ పరస్పరం తీవ్రంగా విమర్శించుకోవడమూ జరిగింది. దుర్గా పూజలో గవర్నర్‌కు సరైన గౌరవం లభించలేదన్న అంశం మొదలుకుని ఆయన భద్రత వరకు అనేక అంశా ల్లో వివాదాస్పదమయ్యాయి. సెప్టెంబర్ 19న కేంద్ర మంత్రి బాబూ సుప్రియోను కొందరు విద్యార్థులు ఘెరావ్ చేసినపుడు ఆయనను రక్షించేందుకు జాదవ్‌పూర్ యూనివర్సిటీ గవర్నర్ వెళ్లారు. ఆ సందర్భంగా కూడా ఆయన తగిన భద్రత కల్పించలేదన్న విమర్శలూ చెలరేగాయి. తాజాగా ముర్షీరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన గవర్నర్‌కు హెలికాప్టర్ సమకూర్చేందుకు ప్రభుత్వం నిరాకరించడం వివాదానికి కారణమైంది. తనకు హెలికాప్టర్ సమకూర్చాలని గవర్నర్ కోరడం విడ్డూరంగా ఉందని, ఇది అధికార దుర్వినియోగం తప్ప మరేమీ కాదని మమత ప్రభుత్వం పేర్కొం ది. ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనే గవర్నర్ పరోక్ష విమర్శలు గుప్పించారు. ‘నా ప్రకటనలు సరైన విధంగా అర్థం చేసుకోకుండా కొందరు వ్యక్తులు ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు’ అని మమతను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. అలాగే, బులబుల్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీలో కూడా రాజకీయాలు చోటుచేసుకున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధమని గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. గవర్నర్ వంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సమాంతర పాలన చేసే ప్రయత్నం చేయకూడదని మమత ఎదురుదాడికి దిగారు. గవర్నర్ తన రాజ్యాంగ విధులకు పరిమితం కాకుండా ప్రభుత్వ పనితీరులో కూడా జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ పార్థా చటర్జీ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు.
*చిత్రం...పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్