జాతీయ వార్తలు

రక్షిత నీరు ఎండామావే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అన్ని మెట్రోసిటీలకంటే వాణిజ్య నగరం ముంబయిలో కుళాయి నీళ్లే సురక్షితమని తేలింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో కుళాయి నీళ్లను పరీక్షించిన తరువాత కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. ముంబయి వాసులు ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫైర్లు కొనుక్కోవల్సిన అవసరం లేదని కుళాయి నీళ్లే సురక్షితమని తెలిపారు. 17 రాష్ట్రాల్లో రాజధానులు, మెట్రో నగరాల్లో నీటి నమూనాలను పరీక్షించారు. దేశ రాజధాని ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై సహా పలు పెద్ద నగరాల్లో నీటి నాణ్యతా ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని తేలింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ఈ పరీక్షలు నిర్వహించింది. అలాగే 17 రాష్ట్రాల రాజధానుల్లో పరిస్థితి ప్రతికూలంగా ఉన్నట్టు ఫలితాలు వచ్చాయి. నగర వాసులకు రక్షిత నీరు ఎండమావేనని అధ్యయనంలో తేలిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. ఇరవై రాష్ట్రాల రాజధానుల కుళాయి నీటిని పరీక్షించగా ఒక్క ముంబయి మహానగరంలోని నీళ్లే సురక్షితమని వెల్లడైనట్టు ఆయన తెలిపారు. కుళాయి ద్వారా సరఫరా చేస్తున్న నీటి విషయంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు మంత్రి చెప్పారు. పైపులైన్ల ద్వారా అందజేస్తున్న నీటి విషయంలో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ప్రస్తుతం కఠిన చర్యలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇక నుంచి అలా ఉండదని కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బీఐఎస్ తొలిదశలో 11 నమూనాలు ఢిల్లీ నుంచి సేకరించినట్టు తెలిపిన పాశ్వాన్ నాణ్యత విషయానికి వస్తే ఇక్కడ కుళాయి నీళ్లు ఏ మాత్రం సురక్షితం కాదని తేలిందని వెల్లడించారు.

*చిత్రం...మంచినీటి నాణ్యతా పరీక్షలకు సంబంధించి శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర ఆహార,
ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్