జాతీయ వార్తలు

కాలుష్య నివారణకు కలిసి పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: వాయు కాలుష్యం సమస్యకు పరిష్కారం కనుగొనడానికి కలిసి పనిచేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు హితవు పలికారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఇచ్చిన ‘చౌకీదార్ చోర్ హై’ నినాదానికి మద్దతిచ్చినందుకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని జావడేకర్ చేసిన ట్వీట్‌కు ఢిల్లీ సీఎం స్పందించారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని, వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడంపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఇదివరకు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసి, ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇచ్చిన నేపథ్యంలో జావడేకర్ ట్వీట్ చేశారు. జావడేకర్ ట్వీట్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హిందీలో బదులిచ్చారు. ‘సర్, ఇది రాజకీయాలు చేయవలసిన సమయం కాదు. కలిసి కాలుష్యాన్ని అణచివేయాల్సిన సమయమిది. అన్ని ప్రభుత్వాలు ప్రజలకు ఉపశమనం కలిగించడానికి కలిసి పనిచేయాలి. ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ ప్రజలు కాలుష్యాన్ని నిరోధించడానికి తాము చేయవలసిందంతా చేస్తున్నారు. మాకు మీ మద్దతు కావాలి, సర్’ అని కేజ్రీవాల్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సందేశంలో జావడేకర్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం ఉదయం వాయు కాలుష్యం కొంత తగ్గినప్పటికీ, ఇంకా ‘తీవ్రమయిన’ కేటగిరీలోనే ఉంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నగరంలో కాలుష్యాన్ని నిరోధించేందుకు రోడ్లపై వాహనాల రాకపోకలను తగ్గించడానికి నవంబర్ నాలుగో తేదీ నుంచి 15వ తేదీ వరకు బేసి-సరి విధానాన్ని ప్రవేశపెట్టింది.