జాతీయ వార్తలు

30న ‘ భారత్ బచావో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. అందుకోసం శుక్రవారం ఢిల్లీలోని వార్ రూమ్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమాశంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ నుంచి ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ ఆర్సీ కుంతియా మాట్లాడుతూ దేశ రాజధానిలో ఈ నెల 30న రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘ భారత్ బచావో’ ర్యాలీకి పెద్దఎత్తున కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఈ నెల 25 వరకు అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లో ‘్భరత్ బచావో’ నిరసన చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి 1200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు హాజరవుతారని, ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది కార్యకర్తలు ఆందోళనలో పాల్గొంటారని పేర్కొన్నారు. తెలంగాణ ఇంచార్జ్ కార్యదర్శి బోసు రాజు మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు మాట్లాడుతూ ఏపీలో పీసీసీ అధ్యక్షుడి మార్పుపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, అందరినీ కలుపుకునిపోయే సీనియర్ నాయకుడినే పీసీసీ చీప్‌గా అధిష్ఠానం నియమిస్తుందని తెలిపారు.