జాతీయ వార్తలు

సభకు సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేలా అన్ని పార్టీలూ సహకరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో అభ్యర్థించారు. ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్, వివిధ పార్టీల సభా పక్ష నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 18 నుంచి మొదలు కానున్న పార్లమెంటు సమావేశాల్లో తాము చర్చకు పెట్టదలచుకున్న అంశాల గురించి ఈ పార్టీల నేతలు ఈ సందర్భంగా వెల్లడించారు. లోక్‌సభా వ్యవహారాల సభా కమిటీలో చర్చించిన తర్వాత సాధ్యమైనంత మేర అన్ని అంశాలను సభలో ప్రస్తావించేందుకు అనుమతిస్తానని స్పీకర్ ఓం బిర్లా ఈ సందర్భంగా వెల్లడించారు. సమావేశాలు ఎలాంటి అవరోధాలు లేకుండా నిరాటంకంగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీల నాయకులను ఈ సందర్భంగా ఆయన కోరారు. సభ ప్రజలకు జవాబుదారీ కాబట్టి, ప్రజలకు సంబంధించిన అంశాలను మాత్రమే సభ్యులు ప్రస్తావిస్తారని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. సభలో చర్చ జరగాలంటే ముందుగా అది ఎలాంటి అవరోధం లేకుండా కొనసాగాల్సి ఉంటుందని ఓం బిర్లా తెలిపారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా 20 సిట్టింగ్‌లు ఉంటాయని పేర్కొన్న ఆయన ‘17వ లోక్‌సభ తొలి సమావేశం మాదిరిగానే ఈ సమావేశాలు కూడా అర్థవంతంగా ఫలప్రదంగా సాగేందుకు సహకరిస్తాం’ అని అన్ని పార్టీల నేతలు తనకు హామీ ఇచ్చారని తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లును ప్రతిపాదిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ తదితర దేశాలకు చెందిన హిందువులు, సిక్కులు, జైన్లు, ఇతర ముస్లీమేతర భారతీయులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదించనున్నది. ఈ బిల్లును ప్రతిపాదిస్తే సమావేశాలు సజావుగా జరిగే ప్రసక్తే లేదని ప్రతిపక్షాలు స్పీకర్ ఓం బిర్లాకు స్పష్టం చేసినట్లు తెలిసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుండి వచ్చిన హిందువులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులకు భారతదేశ పౌరసత్వం ఇవ్వటం తమకు అభ్యంతరం లేదు కానీ ముస్లింలను వదిలివేయటం ఏమిటని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. ముస్లిమేతరులు అనే పద ప్రయోగం ఎంత మాత్రం మంచిది కాదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రతిపాదించనున్న ఈ బిల్లు మతాల మధ్య చిచ్చు పెడుతుందన్నది వారి వాదన. అయితే బీజేపీ నాయకులు మాత్రం ఈ వాదనను కొట్టివేస్తున్నారు. పాకిస్తాన్ తదితర దేశాలలో ఎదురవుతున్న కష్టాల నుండి తప్పించుకునేందుకు వలస వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులకు భారతదేశంలో శరణు లభించకపోతే మరెక్కడ లభిస్తుందని వారు
ప్రశ్నిస్తున్నారు. ఈ దేశాల నుంచి ఇదివరకే భారతదేశానికి వచ్చిన వందలు, వేలాది మంది హిందువులు, సిక్కులు, బౌద్ధులు భారత పౌరసత్వం లేకపోవటం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ దేశాల నుంచి వలస వచ్చే ముస్లిమేతరులను ఆదుకోవలసిన బాధ్యత మనపై ఉన్నదని వారు వాదిస్తున్నారు. అఖిలపక్ష సమావేశానికి మంత్రి అర్జున్ రాం మేఘవాల్ (బీజేపీ), టీఆర్ బాలు (డీఎంకే), సుదీప్ బందోపాధ్యాయ (టీఎంసీ), డానిష్ అలీ (బీఎస్), వినాయక్ రౌత్ (శివసేన), అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం), చిరాగ్ పాశ్వాన్ (ఎల్‌జేపీ) అధీర్ రంజన్ చౌధరి (కాంగ్రెస్) హాజరయ్యారు.
ఈ సమావేశం అనంతరం మీడియా మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుధీప్ బందోపాధ్యాయ ‘పశ్చిమ బెంగాల్ గవర్నర్ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్న విషయాన్ని నేను ఈ అఖిలపక్ష భేటీలో లేవనెత్తాను’ అని తెలిపారు. గవర్నర్ ఈ రకంగా వ్యవహరించడాన్ని అనుమతించరాదని పేర్కొన్న ఆయన నిరుద్యోగ సమస్య, ఆర్థిక స్థితిగతుల గురించి లోక్‌సభలో విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. వీటికి అన్ని విధాలుగా సభాపతి అనుమతించాలని ఆయన కోరారు. ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారతంలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం గురించి కూడా సభలో చర్చ జరగాలని బీఎస్పీ నాయకుడు డేనిష్ అలీ కోరారు.
*చిత్రం... ఢిల్లీలో శనివారం అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం వెలుపలకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, టీఎంసీ ఎంపీ బందోపాధ్యాయ తదితరులు