జాతీయ వార్తలు

కాంగ్రెస్‌వి నిరాధార ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాలపై సుప్రీంకోర్టు గురువారం వెలువర్చిన తీర్పు కాంగ్రెస్‌కు, ఆ పార్టీ అగ్రనాయకులకు చెంపపెట్టు లాంటిదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నిరాధార, హానికరమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ యావత్ జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని అమిత్ షా డిమాండ్ చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై విలువైన పార్లమెంట్ సమయాన్ని విపక్షాలు వృథా చేశాయని.. ఇది అవమానకరంగా గుర్తించాలని షా ట్వీట్ చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై దాఖలైన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇవ్వడం ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటిదని షా వర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనా దక్షతకు, పారదర్శక, అవినీతి రహిత పాలనకు ఈ తీర్పు నిదర్శనమని షా స్పష్టం చేశారు. ‘రాఫెల్‌పై కాంగ్రెస్ విలువైన పార్లమెంట్ సమయాన్ని వృథా చేసిందనీ.. విలువైన సమయాన్ని ప్రజా సమస్యలపై పెడితే బాగుండేదని’ కాంగ్రెస్‌కు షా హితవు పలికారు. ‘సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి.. విలువైన సమయాన్ని వృథా చేసిన కాంగ్రెస్ యావత్ భారత్ జాతికి క్షమాపణ చెప్పి తీరాలని’ ఆయన డిమాండ్ చేశారు. ఫ్రాన్స్ నుంచి ఎన్నో బిలియన్ డాలర్ల విలువైన 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో భారీ స్కాం జరిగిందంటూ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు చేసిన తప్పుడు ప్రచారం సాగించారని.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు ఏం చెబుతారని షా ప్రశ్నించారు. ప్రతిపక్షాలు రోజుల తరబడి ఈ వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనలు చేసి యావత్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించాలని అన్నారు. ఈ ఒప్పందం వ్యవహారంలో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరిస్తూ మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది.