జాతీయ వార్తలు

జాతీయ స్థాయిలో వైద్య రంగంలో కొత్త నిబంధనలకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వైద్య రంగంలో నూతన సంస్కరణలకు నాంది పలుకుతూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో మందులను నిల్వ చేసి రోగులకు అందించే విధంగా ప్రతిపాదనలను కేంద్రం సిద్ధం చేసింది. ఈ ముసాయిదా నోటిఫికేషన్‌ను అన్ని రాష్ట్రాలకు వారి అభిప్రాయాలను తెలియచేయాలని కేంద్రం పంపింది. డ్రగ్స్, కాస్మోటిక్స్ రూల్స్ 1945ను సవరించాలని ప్రతిపాదిస్తూ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న దాని ప్రకారం ఫార్మసిస్టులు, డాక్టర్లు మాత్రమే మందులను నిల్వ ఉంచుకుని రోగులకు ఇవ్వాలి. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఆరోగ్య కార్యకర్తలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, నర్సులు, మిడ్‌వైఫ్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్ల పరిధిలో పనిచేసే కార్యకర్తలు మందులను స్టాక్ చేసి రోగులకు పంపిణీ చేయవచ్చును. గుర్తింపు పొందిన ఆరోగ్య, వైద్య కార్యకర్తలు (ఆషా) కార్యకర్తలు కూడా మందులను ఇచ్చేందుకు అర్హత లభిస్తుంది. ఔషధ సాంకేతిక సలహా మండలి అనుమతి తీసుకుని కేంద్రం ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ తమ ఉపాధికి, వృత్తికి ముప్పుగా తయారవుతుందని ఫార్మసిస్టులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ముసాయిదా పత్రంలోని అంశాలపై తమ అభ్యంతరాలను కేంద్రానికి తెలియచేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో లక్షల్లో ప్రభుత్వ ఏజన్సీల ద్వారా ఆరోగ్య కార్యకర్తలు పనిచేస్తున్నారు. కాని వారికి మందులు ఇచ్చేవారుండరు. డాక్టర్ల చీటిపైనే వీరు మందులు ఇస్తారు. ప్రజారోగ్య వ్యవస్థలో తీసుకువస్తున్న మార్పుల వల్ల మందులను సకాలంలో రోగులకు అందించేందుకు వీలవుతుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అర్హత ఉన్న డాక్టర్లు మందుల చీటి ఇస్తారు. కాని మందులు ఇచ్చేందుకు ఫార్మసిస్టులు ఉండరు. ఈ కొత్త ప్రతిపాదన వల్ల ప్రజారోగ్య వ్యవస్థలో వౌలిక సదుపాయాలను పటిష్టం చేసినట్లవుతుందని ఆ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో మందుల సరఫరా వల్ల ఫార్మాసిస్టుల ఉపాధికి ముప్పు తలెత్తింది. ఫార్మసీ గ్రాడ్యూయేట్లు, డిప్లమో ఫార్మసీ చదివిన వారు కూడా నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్నారు. కాని వీరి సేవలు గ్రామీణ రంగంలో లభించడం లేదు. ఫార్మసిస్టుల పాత్రను కుదించివేసే కేంద్రం ప్రయత్నం వాంచనీయ పరిణామం కాదని ఫార్మసిస్టులంటున్నారు. నాణ్యమైన వైద్య సేవలను గ్రామీణ పేదలకు అందించడానికి ముసాయిదా నోటిఫికేషన్‌లోని లక్ష్యాల ఉపయోగపడవని ఫార్మసిస్టులంటున్నారు. ఫార్మసీ విద్య చదవకుండా ఒక సాధారణ ఆరోగ్య కార్యకర్త మందులను ఎలా పంపిణీ చేస్తారని ఫార్మసిస్టులు ప్రశ్నిస్తున్నారు.