జాతీయ వార్తలు

నెహ్రూ సేవలు నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, నవంబర్ 14: తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గురించి, ఆయన సేవలను యువతకు తెలుసుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం అంటే విశ్వాసం లేని కొన్ని శక్తులు యువతను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవపట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. ‘నెహ్రూ ఎవరో కూడా తెలియని వారు దేశంలో ఉన్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు’అని ఆయన ఆరోపించారు. దేశానికి పండిట్ నెహ్రూ అందించిన సేవలు నిరుపమానమని, అజరామరమని గెహ్లోట్ స్పష్టం చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ‘నవతరం తొలి ప్రధాని నెహ్రూ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’అని ఆయన నొక్కి చెప్పారు. ‘చరిత్ర మీకు తెలియాలి. ఒక వేళ అలాజరగని పక్షంలో 25 ఏళ్ల తరువాత దేశంలో ఏం జరిగిందీ మీకు తెలియని పరిస్థితి ఉంటుంది’అని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో బాలసాహిత్య అకాడమీ ఏర్పాటు చేసిన సందర్భంగా యువతకు గెహ్లోట్ సందేశం ఇచ్చారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని కొన్ని శక్తులు సామాజిక మాధ్యమాల్లో యువతను తప్పుదోవపట్టిస్తోందని సీఎం ధ్వజమెత్తారు. తొలి ప్రధానిని కించపరిచేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఇది తీవ్రమైన నేరమని ఆయన హెచ్చరించారు.‘మీరు అలాంటి దుష్ప్రచారం నమ్మరన్నది నా విశ్వాసం. నెహ్రూను జీవిత విశేషాలు, దేశానికి ఆయన అందించిన సేవలు తెలుసుకుని నవభారత నిర్మాణానికి కృషి చేయండి’అని యువతను ఉద్దేశించి అన్నారు. దేశంలో ఇప్పుడేమి జరుగుతుందో అందరికీ తెలుసని, దీని వెనక ఉన్న శక్తుల గురించి ప్రజలకు అవగాహన ఉందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. పండిట్ నెహ్రూ దేశ స్వాతంత్య్రం కోసం పదేళ్లు జైలుశిక్ష అనుభవించారని రాజస్థాన్ సీఎం వెల్లడించారు. స్వాతంత్య్ర భారతానికి తొలి ప్రధానిగా నెహ్రూ అందించిన సేవలు నిరుపమానమని ఆయన పేర్కొన్నారు.

*చిత్రం...రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్