జాతీయ వార్తలు

సుప్రీం తీర్పు ఆనందాన్నిచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై చెలరేగిన దుమారానికి సుప్రీం కోర్టు చెక్ పెట్టడంతో సర్వత్రా హర్షం వ్యక్తవౌతోంది. రాఫెల్ ఒప్పందంపై గురువారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వడం ‘సంతోషదాయకం’ అని భారత వైమానిక దళ మాజీ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) బీఎస్ ధనోయా వ్యాఖ్యానించారు.
యుద్ధ విమానాల కొనుగోలుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కేంద్ర ప్రభుత్వ వైఖరి తేటతెల్లమైందనీ.. దేశ సైనిక సామర్థ్యం మరింత బలోపేతం కావడానికి మార్గం సుగమం అయిందని ధనోయా హర్షం వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ ఏరోస్పేస్ మేజర్ దసాల్ట్ ఏవియేషన్ నుంచి 59వేల కోట్ల విలువైన 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం రాజకీయంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ధనోయా పదవీకాలంలోనే ఈ ఒప్పందం జరగగా.. ప్రతిపక్షాల ఆరోపణలను ఈయన తీవ్రంగా ఖండించారు. ‘ఈ తీర్పును స్వాగతిస్తున్నాం.. ఈ అంశంపై ప్రభుత్వ పరిస్థితి ఏమిటో తెలిసింది... మొత్తమీద ఈ వివాదానికి సుప్రీం తీర్పుతో తెర పడింది.. దీనికి మేం చాలా సంతోషంగా ఉన్నాం’ అని ధనోయా స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అనేక అవకతవకలు జరిగాయని.. సీబీఐతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించి సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇచ్చింది. దీనిపై 2018 సంవత్సరం డిసెంబర్ 14న జరిగిన విచారణలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం కానీ.. అనుమానాలు లేవనెత్తడానికి ఇది సరైన సమయం కాదని సుప్రీం పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు సమగ్ర దర్యాప్తు చేయాలంటూ రివ్యూ పిటిషన్లను దాఖలు చేయగా దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం సుప్రీం ధర్మాసనం పిటిషన్లను తిరస్కరిస్తూ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. భారత వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచుతూ రాఫెల్ విమానాల కొనుగోలుకు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని తాను సమర్థించాననీ.. ప్రతిపక్షాలు దీనిని ఎన్నికల్లో లబ్ధికి వాడుకోవడం బాధ కలిగించిందని ధనవా పేర్కొన్నారు.
భారత ఆర్మీ, నేవీల సామర్థ్యాన్ని పెంచే విధంగా ఈ తీర్పు రావడం బలగాలకు మరింత మనో స్థైర్యాన్నిస్తుందని స్పష్టం చేశారు. భారత్ సైనిక సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై 2016లో 56వేల కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు పంపేందుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం మే నెలలో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు తరలించారు కూడా. రాఫెల్ ద్వారా అత్యంత సామర్థ్యం కలిగిన ఆయుధాలు, క్షిపణులను తరలించడానికి వీలు పడుతుంది.