జాతీయ వార్తలు

కేరళ పాత్రే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, నవంబర్ 14: శబరిమల స్వామి అయప్ప ఆలయంలోకి మహిళ ప్రవేశం అంశం మళ్లీ మొదటికొచ్చింది. 10-50 ఏళ్ల మధ్య వయసుగల మహిళల ఆలయ ప్రవేశాన్ని అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు దాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన శబరిమల అంశంపై కేరళలోని వామక్ష ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందోన్నన్న ఉత్కంఠ నెలకొంది. పైగా అయ్యప్ప ఆలయ ద్వారా ఈనెల 16న తెరుచుకోనున్నాయి. 17 నుంచి ఆలయాన్ని భక్తులకు అందుబాటులో ఉంచుతారు. తాజాగా సుప్రీం కోర్టు నిర్ణయంతో వామపక్ష ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందోనన్న ప్రశ్న అందరి మదిలోనూ ఉంది. కేరళ దేవాదాయ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ గురువారం ఇక్కడ మాట్లాడుతూ సుప్రీం తీర్పును అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ‘ప్రతిపక్షాన్ని నేను కోరేదొకటే. గత ఏడాదిలాగా ఈ అంశంపై రాజకీయాలు చేయవద్దు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’అని మంత్రి కోరారు. మహిళల ఆలయ ప్రవేశ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని సుప్రీం కోర్టు ప్రకటించిన తరువాత రాజధానిలో ఆయన మీడియాతోమాట్లాడారు. మహిళల ఆలయ ప్రవేశాన్ని అనుమతిస్తారా? అన్న ప్రశ్నకు ‘దీనిపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదు’అని బదులిచ్చారు. గత ఏడాది కేరళను శబరిమల ఆలయంలోకి మహిళల అనుమతి అంశం కుదిపేసింది. బీజేపీ, హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. 2018 సెప్టెంబర్ 28న మహిళ ఆలయ ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. సుప్రీం తీర్పును అమలు చేయడానికి వామపక్ష ప్రభుత్వం ముందుకురావడంతో కొండపైనా, కింద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శిబరిమల అట్టుడికిపోయింది. ఇప్పుడు ఆ అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు నిర్ణయం సానుకూలంగానే ఉంటుందన్న ఆశాభావం అయప్ప ఆలయ ప్రధాన పూజారి కండరారు రాజీవురు వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలు, సమ్మకాలకు విలువనిచ్చేలా తీర్పు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కే రాజశేఖరన్ మాట్లాడుతూ మహిళలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆలయంలోకి అనుమతించవచ్చదని అన్నారు. ‘మహిళలను ఆలయ ప్రవేశం చేద్దామని పోలీసులు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయి’అని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువడే వరకూ రాష్ట్ర ప్రభుత్వం వేచి చూడాలని అప్పటి వరకూ మహిళలకు అనుమతి ఇవ్వొద్దని ఆయన డిమాండ్ చేశారు. 10-50 మధ్య వయసు మహిళలెవరైనా ఆలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే ప్రభుత్వమే వారిని అడ్డుకోవాలని చెప్పారు.

* సుప్రీం కోర్టు తీర్పు అయప్ప భక్తుల విజయం. భక్తుల విశ్వాసాలను న్యాయస్థానం అర్థం చేసుకుంది
- కేంద్ర మంత్రి వీ మురళీధరన్
* ఈనెల 16, 17న జరిగే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో శబిరిమల అంశంపై చర్చిస్తాం.
- సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
* శబరిమలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పే శిరోధార్యం.
కోర్టు ఏలా చెబితే అలా నడచుకుంటాం.
- ఎల్‌డీఎఫ్ కన్వీనర్ ఏ విజయరాఘవన్
* మహిళ ఆలయ ప్రవేశం అంశంపై ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టించకూడదు. మహిళా భక్తులకు భద్రత కల్పించాలి.
- కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల
* భక్తుల విశ్వాసాలను గౌరవించేదిగా సుప్రీం కోర్టు తీర్పు ఉంది. సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలి
- మాజీ సీఎం ఉమెన్ చాందీ
* విస్తృత ధర్మాసనం తీర్పు ఇచ్చేవరకూ మహిళలను ఆలయంలోకి అనుమతించరనే భావిస్తున్నాం. ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు దీన్ని అప్పగించడం అరుదైన అంశం
- పందళ వంశీయుడు శశికుమార్ వర్మ
* న్యాయనిపుణలును సంప్రదించాకే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. 16న ఆలయ ద్వారాలు తెరుకుంటాయి.
- రాష్ట్ర మంత్రి శైలజ
* అయోధ్యలో వెలువడిన తీర్పు తరహా ఆదేశాలే శబరిమల ఆలయానికి సంబంధించి కేసులోనూ వస్తాయి.
- సంఘ్ పరివార్
* సుప్రీం కోర్టు తీర్పు మహిళా భక్తులకు అనుకూలంగానే వచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వకపోవడం గమనార్హం.
- బిందు (గత ఏడాది ఆలయ ప్రవేశానికి
ప్రయత్నించిన మహిళ)