జాతీయ వార్తలు

దర్యాప్తునకు మార్గం సుగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: సుప్రీం కోర్టు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై దర్యాప్తు జరిపేందుకు మార్గం సుగమం చేసిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా తెలిపారు. రాఫెల్ వాస్తవాలు వెలుగులోకి రావాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సుర్చేవాలా గురువారం ఏఐసీసీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరిపించటం తమ పరిధిలోని అంశం కాదు కాబట్టి పోలీసు శాఖ, సీబీఐ తదితర స్వతంత్ర సంస్థలేవైనా దర్యాప్తు జరపవచ్చునని కోర్టు తమ తీర్పులో స్పష్టం చేసిందని కాంగ్రెస్ ప్రతినిధి వెల్లడించారు. సీబీఐ దర్యాప్తుకు తమ తీర్పు ఎంత మాత్రం అడ్డుకాదని కోర్టు తెలపటం గమనార్హమని సుర్జేవాలా చెప్పారు. కోర్టు తీర్పుపై బీజేపీ సంబరాలు చేసుకోవడం మానుకోవాలని ఆయన సూచించారు. సుప్రీం కోర్టు రాఫెల్ కుంభకోణంలో తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెప్పుకోవటం బీజేపీ మానేయాలని సుర్జేవాలా స్పష్టం చేశారు. రాఫెల్‌పై ఏదైనా స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేయవచ్చునని సుప్రీం కోర్టు తమ తీర్పులో పేర్కొంటే బీజేపీ మాత్రం తీర్పు తమకు అనుకూలమని, తదుపరి దర్యాప్తుకు నిరాకరించిందని చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాఫెల్ కుంభకోణంపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అడిగిన తొమ్మిది ప్రశ్నకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, రక్షణ శాఖ ఎవ్వరు కూడా సమాధానం ఈనాటికి కూడా ఇవ్వలేదని అంటూ ఆయన మరోసారి తొమ్మిది ప్రశ్నలను తిరగదోడారు. దేశ రక్షణతో ఎందుకు సర్దుబాటు చేసుకున్నారన ఆయన ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొనుగోలు చేయవలసిన రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్యను ఎందుకు తగ్గించారని సుర్జేవాలా అడిగారు. కాంగ్రెస్ అడిగిన తొమ్మిది ప్రశ్నలకు దర్యాప్తు మాత్రమే సమాధానం ఇవ్వగలుగుతుందని ఆయన చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై దర్యాప్తు జరిపించే శక్తి నరేంద్ర మోదీ, బీజేపీకి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధినాయకత్వం సుప్రీం కోర్టు తీర్పును వక్రీకరించి దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని సుర్జేవాలా తీవ్ర ఆరోపణలు చేశారు.

*చిత్రం...మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రతినిధి సుర్జేవాలా