జాతీయ వార్తలు

ప్రభుత్వంలో భాగం కావాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: దాదాపు ముప్పై మంది శాసనసభ్యులు పార్టీ నుండి వెళ్లిపోతామని బెదిరించినందుకే మహారాష్టల్రో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించినట్లు తెలిసింది. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం సోనియా గాంధీకి ఎంతమాత్రం ఇష్టం లేదు. తనను బూతుపదాలతో విమర్శించిన శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం వలన రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే మహారాష్టక్రు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే తాము బీజేపీకి మద్దతు ప్రకటిస్తామని బెదిరించినట్లు తెలిసింది. సోనియా గాంధీ రెండు రోజుల క్రితం మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి చెందిన సీనియర్ నాయకులు, శాసనసభ్యులతో సమావేశమై శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటం గురించి చర్చించారు. కాంగ్రెస్, శివసేన పరస్పర వ్యతిరేక ధ్రువాలు.. రెండు వ్యతిరేక ధ్రువాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఎంత వరకు సమర్థనీయమని సోనియా గాంధీతోపాటు మరికొందరు సీనియర్ నాయకులు ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ కాంగ్రెస్ గతంలో తొమ్మిది సందర్భాల్లో శివసేన మద్దతు తీసుకోవటం మరిచిపోరాదని సూచించినట్లు పార్టీ
వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీని భారత రాష్టప్రతిగా ఎన్నుకునే సమయంలో కూడా శివసేన మనకు మద్దతు ఇచ్చింది. పలు ముఖ్యమైన అంశాల్లో శివసేన మద్దతు తీసుకున్నప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వెనకాడాలని శాసనసభ్యులు అధినాయకత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పుడు శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది ఉండదు.. పార్టీకి చెందిన మొత్తం 44 మంది శాసనసభ్యుల్లో ముప్పై మంది పార్టీ ఫిరాయించే ప్రమాదం ఉన్నదని స్పష్టం చేసినట్లు తెలిసింది. మహారాష్టల్రో కాంగ్రెస్‌ను ముఖ్యంగా శాసనసభ్యులను కాపాడుకోవాలంటే శివసేనతో చేతులు కలపవలసిందేనని స్పష్టం చేశారని అంటున్నారు. శాసనసభ్యులు తమ అభిప్రాయాలను కుండబద్దల కొట్టినట్లు చెప్పిన తరువాతే సోనియా మెతకబడ్డారని ఏఐసీసీ వర్గాలు చెప్పాయి. మరాఠా నాయకుడు, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడినప్పుడు కాంగ్రెస్ ఎందుకు దూరంగా ఉండాలన్నది మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యుల ప్రశ్న. ఎన్‌సీపీ-శివసేన ఏర్పాటు చేసే ప్రభుత్వానికి బైటినుంచి మద్దతు ఇవ్వాలన్న సోనియా గాంధీ ప్రతిపాదనను కూడా మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యులు తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తమ సర్వస్వం ఒడ్డి గెలిచిన పార్టీ ఎంపీలు ప్రభుత్వం బైట ఉండేందుకు ఎంతమాత్రం ఇష్టపడలేదని తెలిసింది. ఎన్‌సీపీ, శివసేన, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ బైటినుంచి మద్దతు ఇవ్వకుండా అధికారం పంచుకోవలసిందేనని శాసనసభ్యులు చెప్పారని అంటున్నారు. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరిచకపోతే పార్టీ శాసనసభ్యులు బీజేపీ వైపు వెళ్లడం ఖాయమంటూ మహారాష్టక్రు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించటతో సోనియా గాంధీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారని తెలిసింది.

*చిత్రం... బాంద్రాలో బుధవారం శివసేన నాయకుడు బీకేసీ ట్రిడెంట్‌తో సమావేశం అనంతరం వెలుపలకు వస్తున్న మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేతలు మాణిక్‌రావు థాక్రే, బాలాసాహెబ్ థోరట్, అశోక్ చౌహాన్ తదితరులు