జాతీయ వార్తలు

సుప్రీం తీర్పుపై హర్షాతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) పరిధిలోకి వస్తుందన్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చట్టం విశిష్టత, దాని విస్తృతిని తెలియజేప్పేదిగా సుప్రీం తీర్పు ఉందని సమాచార హక్కుల నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యానించారు. ‘సీజేఐ ఆఫీసు ఆర్‌టీఐ పరిధిలోదంటూ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. దీన్ని మేం స్వాగతిస్తున్నాం’అని కామన్‌వెల్త్ మానవ హక్కుల సంఘం అధినేత వెంకటేశ్ నాయక్ అన్నారు.
ఈ తీర్పు న్యాయవ్యవస్థలోనే ఓ మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ఆర్‌టీఐను నిఘా కోసం వినియోగించవద్దని కోర్టు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆయన అన్నారు. అలాంటప్పుడు పార్లమెంట్‌లో చేసిన చట్టాలు, పారదర్శకతకు అర్థం ఏం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. సీజేఐ కార్యాలయం సమాచార హక్కు చట్టం కిందకు వస్తుందన్న తీర్పు మంచి నిర్ణయమని మాజీ సమాచార కమిషనర్ శైలేష్ గాంధీ అన్నారు. అయితే తీర్పు రావడానికి పదేళ్లు పట్టడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాల కోసం ప్రజా ధనానే్న వెచ్చిస్తారు.
ఈ పరిస్థితుల్లో వారి ఆస్తుల వివరాలు బహిర్గతం చేయడం తప్పనిసరి. దీనికి ఎవరూ అతీతులుకారు’అని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ అన్నారు. ‘ఇది ఆర్‌టీఐ విజయం’ అని మరోక కార్యకర్త అజయ్ దూబే చెప్పారు. ప్రభుత్వం సంస్థలన్నీ ప్రజలకు జవాబుదారీ తనంతోనే ఉండాలన్న వాస్తవం తీర్పు ద్వారా స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆర్‌టీఐను ఓ అస్త్రంగా వాడకూడదని, న్యాయ వ్యవస్థ స్వతంత్రకు భంగం వాటిల్లకూడదన్న ధర్మాసనం తీర్పు దురదృష్టకరంగా దూబే వ్యాఖ్యానించారు.