జాతీయ వార్తలు

పార్లమెంట్ ఆమోదానికి ఓఎస్‌హెచ్ కోడ్ బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: ప్రభుత్వం ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ (ఓఎస్‌హెచ్) కోడ్‌కు పార్లమెంటు ఆమోదం పొందడానికి చర్యలు తీసుకుంటుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ బుధవారం తెలిపారు.
ప్రభుత్వం ఈ కోడ్‌ను 2019 జూలై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ కోడ్ పరిధిలోకి వచ్చే వివిధ రకాల కార్మికుల సంఖ్య పెరగడంతో పాటు 13 కేంద్ర కార్మిక చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించడం జరుగుతోంది. పది మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న అన్ని సంస్థలకు ఈ ప్రతిపాదిత చట్టం వర్తిస్తుంది. భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన 13 కార్మిక చట్టాలు కలిపి ఈ కొత్త చట్టం ఏర్పడుతోంది.
ఈ కొత్త చట్టంలో కలిసిపోయే చట్టాలలో ఫ్యాక్టరీల చట్టం- 1948, గనుల చట్టం- 1952, ద కాంట్రాక్ట్ లేబర్ (రెగ్యులేషన్, అబాలిషన్) యాక్ట్- 1970 ఉన్నాయి.
‘మేము పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తప్పకుండా ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ (ఓఎస్‌హెచ్) చట్టం- 2019ను తీసుకొస్తాం. పార్లమెంటు స్థారుూసంఘం ఈ ప్రతిపాదిత చట్టంపై అభిప్రాయాలు తెలియచేయాల్సిందిగా ప్రజలను కోరింది’ అని గంగ్వార్ విలేఖరులకు తెలిపారు. బుధవారం నాడిక్కడ ఎంప్లారుూస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విడిగా విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి చివరి వారంలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్మిక సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే వేతనాల చట్టానికి పార్లమెంటు ఆమోదం పొందింది. ఓఎస్‌హెచ్ కోడ్ ఈ సంస్కరణల్లో రెండోది. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 44 కార్మిక చట్టాలను నాలుగు- వేతన, ఓఎస్‌హెచ్, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు- అనే కొత్త చట్టాలుగా కుదించాలని భావిస్తోంది.
*చిత్రం...కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్