జాతీయ వార్తలు

ప్లాస్టిక్ చెత్త సేకరణను మన్రేగా పథకంలో చేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: స్వచ్చ భారత్ కార్యక్రమం విజయం సాధించేందుకు ఏక ఉపయోగ ప్లాస్టిక్ చెత్తను సేకరించే అంశాన్ని మన్రేగా పథకంలో చేర్చాలని వైసీపీ లోక్‌సభ సభ్యుడు, సబార్డినేట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు రాఘురామ కృష్ణంరాజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. సబార్డినేట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ మొదటి సమావేశంలో 2022 నాటికి ఏక ఉపయోగ ప్లాస్టిక్ ఉపయోగాన్ని నిషేధించటం గురించి చర్చించినట్లు ఆయన లేఖలో తెలిపారు. ఏక ఉపయోగ ప్లాస్టిక్ ఉపయోగాన్ని 2022 నాటికి నిషేధించాలన్న ప్రధాన మంత్రి కలలను సాకారం చేసేందుకు అవసరమైన చర్యలను తమ కమిటీ తీసుకుంటోందని ఆయన తెలిపారు. తమ కమిటీ రెండో సమావేశంలో స్వచ్ఛ భారత్‌ను అమలు చేయటం గురించి చర్చిస్తామని రఘురామ కృష్ణంరాజు ప్రధాన మంత్రికి తెలిపారు. ఏక ఉపయోగ ప్లాస్టిక్ చెత్తను నియంత్రించేందుకు.. దాని సేకరణను మన్రేగా కార్యక్రమాల్లో చేర్చాలని పలు స్వచ్చంద సంస్థలు అభిప్రాయపడ్డాయని నరేంద్ర మోదీకి వివరించారు.