జాతీయ వార్తలు

వెనక్కి తగ్గలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 13: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు భారతీయ జనతా పార్టీకి మధ్య ‘పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే’ చందంగా తయారైంది. రాష్ట్రంలో అధికార పార్టీని ఎండగట్టేందుకు ఎలాంటి అవకాశం దొరికినా అంది పుచ్చుకొని పోరాడేందుకు బీజేపీ ఎంతమాత్రం వెనుకాడడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్‌ను కలవరపెడుతున్న డెంగ్యూ మహమ్మారి అంశాన్ని పార్టీకి అనువుగా మార్చుకోవాలని కమలనాథులు భావించారు. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్‌పై విరుచుకుపడేందుకు బీజేపీ శ్రేణులు సమాయత్తమయ్యారు. రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి విజృంభించడాన్ని నిరసిస్తూ బుధవారం కమలనాథులు భారీ ర్యాలీని తలపెట్టారు. దీనిని పోలీసు యంత్రాంగం అనూహ్యంగా తిప్పికొట్టింది. కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో 44వేల 852 కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ మహమ్మరి కారణంగా జనవరి నుంచి ఇంతవరకు 25 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీనిని రాష్ట్ర ఆరోగ్య శాఖ యంత్రాంగమే స్వయంగా పేర్కొం ది. రాష్ట్రంలో ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటి 14 స్థానాలను కైవసం చేసుకొన్న బీజేపీ.. అవకాశం వచ్చినప్పుడల్లా తృణమూల్ కాంగ్రెస్‌పై యుద్ధం చేయాలని సంకల్పించింది. తృణమూల్ కాంగ్రెస్ కన్నా కేవలం నాలుగు స్థానాలు మాత్రమే తక్కువ సాధించిన బీజేపీ.. పశ్చిమ బెంగాల్‌లో సైతం పట్టు సాధించి అధికార పగ్గాలు చేపట్టడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా తలపెట్టిన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం వల్లే దోమలు విపరీతంగా ప్రబలి డెంగ్యూ మహమ్మారి విజృంభణకు కారణమైందని బీజేపీ ఆరోపించింది. కోల్‌కతాలోని సెంట్రల్ ఎవెన్యూ నుంచి భారీ ర్యాలీని ప్రారంభించింది. పలు ప్రాంతాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలను నిలదీశారు. ఆందోళన చేపట్టిన బీజేపీ శ్రేణులను తొలుత వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. పోలీసులపై వాటర్ బాటిళ్లను, రాళ్లను విసిరారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు సైతం తిప్పి కొడుతూ ఆందోళనకారులపై వాటర్ కెనాన్‌లను ప్రయోగించాల్సి వచ్చింది. పరస్పర దాడుల్లో పలువురు బీజేపీ శ్రేణులు, పోలీసులకు గాయాలయ్యాయి. బీజేపీ నేతలను నిర్బంధించి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
*చిత్రాలు.. డెంగ్యూ వ్యాధి ప్రబలుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కోల్‌కతాలో బుధవారం ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలు.
*వారిని వాటర్ క్యానన్లను ఉపయోగించి చెల్లాచెదురు చేసి, అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు