జాతీయ వార్తలు

భారతీయతే ప్రపంచానికి మార్గదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: భారతీయతే రానున్న రోజుల్లో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మారుతున్న ప్రపంచీకరణ నేపధ్యంలో భారత మూలవిలువలకు కట్టుబడి ఉండడమే దేశ సమగ్రాభివృద్ధికి రాచబాటలు వేస్తుందని అన్నారు. బుధవారం ఢిల్లీలో జీవీ మావలంకర్ హాల్‌లో జరిగిన శ్రీ దత్తోపంత్ ఠెంగ్డీ శత జయంతి కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రైతులు, కార్మికుల కొనుగోలు శక్తి పెరిగినపుడే వారి ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయని.. దీనిద్వారా దేశ పురోగతి మరింత వేగవంతం అవుతుందని ఆనాడే గుర్తించి ఆ దిశగా కృషిచేసిన మహనీయుడు శ్రీ దత్తోపంత్ ఠెంగ్డీ అని అన్నారు. దేశంలో కార్మిక, కర్షక సంఘాలు, వాటి పనితీరులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆయనో కర్మయోగి, స్ఫూర్తిప్రదాత అని ప్రశంసించారు. జాతీయవాదమే ఊపిరిగా జీవించిన ఠెంగ్డీ దేశ పారిశ్రామిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలపై తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు. దేశ సమగ్రాభివృద్ధికి అసలైన నిర్వచనాన్ని చెప్పి, దాన్ని సాధించేందుకు అహోరాత్రులు శ్రమించిన మహామనీషి శ్రీ దత్తొపంత్ ఠెంగ్డే అని ఉప రాష్టప్రతి అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుని పోవడం ద్వారానే భవ్యమైన భారతాన్ని నిర్మించగలమని ఠెంగ్డెజీ చెప్పిన అంశాలను పాటించడం నేటి సమాజానికి అత్యంత అవసరమని అన్నారు. సమయానికి అనుగుణంగా పాటించడం నేటి సమాజానికి అత్యంత అవసరమని వెంకయ్య తెలిపారు.