జాతీయ వార్తలు

వాయు కాలుష్యం తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత శుక్రవారానికి సాధారణ స్థాయికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీకి పశ్చిమ ప్రాంతంలో పాడైన పంటలను తగులబెట్టే క్రమంలో వస్తున్న గాలుల వేగాన్ని బట్టి చూస్తుంటే వాయు కాలుష్యం తగ్గుతుందని ఆశిస్తున్నట్లు వాయు నాణ్యతను పర్యవేక్షించే ‘సఫర్’ బుధవారం పేర్కొంది. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల నుంచి వాయు కాలుష్య తీవ్రతను పరిశీలిస్తే గురువారానికి 13 శాతం తగ్గే అవకాశం ఉందని సఫర్ స్పష్టం చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రవాణా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో ఢిల్లీకి వాయువ్య దిశ నుంచి గాలుల వేగం పెరిగే అవకాశం ఉందనీ.. ఈ కారణంగా వాయు కాలుష్యం దేశ రాజధానిలో సాధారణ స్థాయికి వస్తుందన్న ఆశాభావాన్ని సఫర్ వ్యక్తం చేసింది. అయితే, బుధవారం రాత్రి మాత్రం కాలుష్య తీవ్రత పెరుగుతుందని పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారనీ.. వాతారణం అనుకూలంగా లేకపోవడంతో గత పదిహేను రోజులుగా ‘ఎమర్జెన్సీ’ కేటగిరీలోకి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందని సఫర్ వర్గాలు పేర్కొన్నాయి. స్కూళ్లు తెరవడంతో అనేకమంది పిల్లలు వాయు కాలుష్యం బారిన పడాల్సి వచ్చింది. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో నిబంధనలను సడలించి ‘సరి - బేసి’ విధానాన్ని ఎత్తివేశారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ విధానాన్ని ఎత్తివేసినట్లు సఫర్ తెలియజేసింది. మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 454 పాయింట్లకు చేరింది. వాయు కాలుష్యం అత్యంత తీవ్రంగా ఉన్న ప్రాంతమైన రోహిణిలో సూచీ 486 పాయింట్లకు చేరింది. వాయు కాలుష్య నాణ్యత సూచీ ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో నెహ్రూనగర్ 484 పాయింట్లు, జహంగిరిపురిలో 483, పరిదాబాద్‌లో 442, గజియాబాద్‌లో 464, గ్రేటర్ నొయిడాలో 460, గుర్‌గావ్‌లో 448, నొయిడాలో 468 పాయింట్లకు చేరినట్లు సఫర్ వర్గాలు పేర్కొన్నాయి. సఫర్ కథనం ప్రకారం వాయు నాణ్యత సూచి 201 నుంచి 300 పాయింట్ల మధ్య ఉంటే ‘పూర్’ కేటగిరీ కిందకు వస్తుందనీ.. 301 నుంచి 400 వరకు ఉంటే ‘వెరీ పూర్’, 401-500 వరకు ఉంటూ (తీవ్ర), 500కు పైగా ఉంటే ‘అత్యంత తీవ్ర’ స్థాయి కిందకు వస్తుంది.