జాతీయ వార్తలు

అంతర్గత సహకారం పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బ్రెజిల్, రష్యా, ఇండి యా, చైనా, దక్షిణాఫ్రికాతో కూడిన ఐదు దేశాల బ్రెగ్జిట్ కూటమి మరింతగా బలపడాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బుధ, గురువారాల్లో జరుగనున్న 11వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తున్న మోదీ ఇందుకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ కూటమిలోని ఐదు దేశాలు ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక సంపత్తిని కలిగివున్నాయని పేర్కొన్న ఆయన డిజిటల్ టెక్నాలజీ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కూడా వీటి మధ్య సహకారం పెంపొందాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే, ఉగ్రవాద నిరోధానికి సంబంధించి కూడా మరింత సన్నిహితంగా ఈ ఐదు దేశాలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటన సందర్భంగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సోనారోతో తాను సమావేశమవుతానని, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లే అంశంపై చర్చిస్తానని మోదీ తెలిపారు. అలాగే, ఈ కూటమిలోని ఇతర భాగస్వామ్య దేశాల నేతలతోనూ సమావేశమై అంతర్గత సహకారాన్ని పెంపొందించుకునే అంశంపై దృష్టి పెడతానని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాలతోపాటు వినూత్న ఆవిష్కరణలపై కూడా ఈ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఐదు బ్రిక్స్ దేశాలు ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉందని మోదీ వెల్లడించారు. బ్రిక్స్ దేశాల అధినేతలతోపాటు ఈ దేశాలకు చెందిన వ్యాపార, వాణిజ్య ప్రతినిధులతో కూడా తాను సమావేశం కానున్నానని ఆయన వెల్లడించారు. భారత్-బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు ఎప్పటికప్పుడు పురోగమిస్తున్నాయని, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఇంధనం, అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి కూడా ఇరు దేశాలు సహకారంతో మసలుతున్నాయని ఆయన తెలిపారు. అలాగే, అనేక బహుముఖ వేదికలపై ఈ రెండు దేశాల మధ్య ఎంతో భావసారూప్యత వ్యక్తం కావడం కూడా వీటి మధ్య అన్నిరంగాల్లోనూ సహకారాన్ని పెంచిందని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. ఈ శిఖరాగ్ర సదస్సు అనేక కోణాల్లో భాగస్వామ్య దేశాల మధ్య అన్ని విధాల సాన్నిహిత్యాన్ని, సహకారాన్ని పెంపొందించే అవకాశం ఉంటుందని అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ పాల్గొనడం ఇది ఆరోసారి. 2014లో బ్రెజిల్‌లోనే జరిగిన ఈ సదస్సుకు ఆయన తొలిసారిగా ఆయన హాజరయ్యారు. ఈ శిఖరాగ్రం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా ప్రధాని జీ జిన్‌పింగ్‌తో కూడా మోదీ సమావేశమవుతారు.
*చిత్రం...ప్రధాని నరేంద్ర మోదీ