జాతీయ వార్తలు

కమల్‌హాసన్‌ది వృథా ప్రయాసే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేలం, నవంబర్ 12: రాజకీయాలకు సంబంధించి సినీ నటుడు కమల్‌హాసన్‌కు కనీస పరిజ్ఞానం కూడా లేదని, ఆయన రాజకీయ అరంగేట్రం విఫలం కావడం ఖాయమని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యాఖ్యానించారు. కమల్‌హాసన్ మాదిరిగానే రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న మరో సినీ నటుడు రజనీకాంత్‌పై కూడా ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో నాయకత్వ శూన్యం ఉందని రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన ‘రాజకీయ నాయకుడికి, సినీ నటుడికి మధ్య ఎంతో తేడా ఉందన్న విషయాన్ని మరచిపోకూడదు’ అని అన్నారు. వయసు మీద పడుతున్న కారణంగా కమల్‌హాసన్‌కు సినిమాల్లో అవకాశాలు లేవని, అందుకే రాజకీయ పార్టీ పెట్టి హడావుడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని పళనిస్వామి అన్నారు. తాను తిరుగులేని నాయకుడినని కమల్‌హాసన్ చెప్పుకుంటున్నారని పేర్కొన్న పళనిస్వామి ఇటీవల రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని ఎంఎన్‌ఎం ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. అలాగే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌హాసన్ పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్నో వెల్లడిస్తే బాగుంటుందని అన్నారు. ఈ రెండు ఉప ఎన్నికల స్థానాల్లో అన్నాడీఎంకే పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కమల్‌హాసన్‌కు 65 ఏళ్లు నిండిపోయాయని, ఇప్పుడు ఆయనను హీరోగా పెట్టి సినిమాలు తీసే పరిస్థితే లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ప్రజాస్వామ్య భారతావనిలో ఎవరికైనా రాజకీయ పార్టీ పెట్టే హక్కు ఉంటుందని, అంత మాత్రాన తాను పెద్ద నాయకుడినని భావించే పరిస్థితే ఉండదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ‘ఇన్నాళ్లూ ఆయన ఎక్కడికెళ్లారు? ఎందుకు ఈ తప్పులను గురించి చెప్పలేదు’ అని పళనిస్వామి అన్నారు. అన్నాడీఎంకేలో తాను 45 సంవత్సరాలుగా ఉన్నానని, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనడమే కాకుండా జైలుకు కూడా వెళ్లాలని ఆయన గుర్తు చేశారు. గతంలో సినీనటుడు శివాజీ గణేశన్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారని ఆయన గుర్తు చేశారు. నాటి మేటి నటుడు ఎంజీ రాంచంద్రన్ తర్వాత సినీ రంగంలో అంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ శివాజీ గణేశన్ రాణించకలేపోయారని, ఇప్పుడు కమల్‌హాసన్‌కు కూడా అదే పరిస్థితి వస్తుందని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన శివాజీ గణేశన్ 1988లో సొంతంగా పార్టీ పెట్టారు. 89లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకలేకపోవడంతో రాజకీయాల నుంచి నిష్క్రమించారు. అంతేకాదు, తిరువయ్యారు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసీ ఓడిపోయారు.

*చిత్రం...తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి