జాతీయ వార్తలు

బీజేపీకి రూ. 700 కోట్ల విరాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: భారతీయ జనతాపార్టీ(బీజేపీ)కి 2018-19 సంవత్సరంలో విరాళాల రూపేణ 700 కోట్ల రూపాయలు సమకూరాయి. ఇందులో అత్యధిక భాగం 356 కోట్ల రూపాయలు ఒక్క టాటా గ్రూపు నుంచే వచ్చినట్టు బీజేపీ ప్రకటించింది. విరాళాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ వివరాలు అందించింది. 2019 అక్టోబర్ 31 వరకూ పార్టీకి అందిన విరాళాల వివరాలు అందులో పొందుపరిచారు. మొత్తంగా రూ. 700 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని బీజేపీ వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సంలో చెక్కులు, ఆన్‌లైన్ ద్వారా సమకూరినట్టు పార్టీ పేర్కొంది. టాటా గ్రూపుఆధ్వర్యంలో నడుస్తున్న ‘ ప్రోగ్రసీవ్ ఎలక్టోరల్ ట్రస్ట్’ నుంచి రూ. 356 కోట్ల రూపాయలు అందాయని తెలిపారు. అలాగే దేశంలోనే అత్యంత సంపన్న ట్రస్ట్ ‘ ద ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్’ నుంచి విరాళంగా రూ. 54.25 కోట్ల రూపాయలు వచ్చినట్టు ఈసీకి లెక్క చెప్పారు. 2018-19 సంవత్సరంలో వచ్చిన విరాళాలకు సం బంధించి డాక్యుమెంట్లు ఎన్నికల సంఘానికి అందజేసినట్టు పార్టీ తెలిపింది. దేశంలోనే కార్పొరేట్ దిగ్గజాలైన భారతీ గ్రూప్, హీరోమోటోకార్ప్, జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, ఓరియంట్ సిమెంట్, డీఎల్‌ఎఫ్, జేకే టైర్స్ అన్నీ కలిపి ‘ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్’ ఏర్పాటు చేశాయి. రూ. 20 వేలు అంతకంటే ఎక్కువ మొత్తం విరాళంగా ఇవ్వదలిస్తే చెక్కులు, ఆన్‌లైన్ ద్వారానే స్వీకరించినట్టు బీజేపీ స్పష్టం చేసింది. ఈసీకి అందజేసిన వివరాల్లో ఎలక్టోరల్ బాండ్ల వివరాలు లేవు వ్యక్తులు, కంపెనీలు ఎలక్టోరల్ ట్రస్టుల నుం చి సేకరించిన విరాళాలను మాత్రమే ఎన్నికల సంఘానికి అందజేసిన డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలన్నీ తమకు వచ్చిన విరాళాల వివరాలు ఈసీకి తెలపాల్సి ఉంటుంది. అయితే ఇరవై వేల రూపాయల లోపు విరాళాలు (వ్యక్తులు, కంపెనీలు ఇచ్చిన), ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూర్చిన వాటి వివరాలు రాజకీయ పార్టీలు వెల్లడించడం లేదు.