జాతీయ వార్తలు

మహారాష్ట్ర లో రాష్ట్రపతి పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: ఎన్డీయే మంత్రివర్గం సిఫారసు మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహారాష్ట్ర లో ఆరు నెలల పాటు రాష్ట్రపతి వాలన విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మహారాష్టల్రో రాజ్యాంగం ప్రకారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపించటం లేదు కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొషియారీ మంగళవారం మధ్యాహ్నం చేసిన సిఫారసును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ప్రధాన మంత్రి బ్రెజిల్‌కు బయలుదేరే ముందు తమ నివాసంలో మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొషియారీ చేసిన సిఫారసుపై చర్చించారు. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించాలన్న గవర్నర్ సిఫారసును రాష్టప్రతికి పంపించారు.రాష్ట్రపతి మంగళవారం సాయంత్రం మంత్రివర్గం సిఫారసును ఆమోదించి మహారాష్టల్రో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 19 రోజులు గడుస్తున్నా ఏ పార్టీ కూడా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేవని గవర్నర్ భగత్‌సింగ్ కొషియారీ కేంద్ర ప్రభుత్వానికి పంపించిన నివేదికలో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మొదట బీజేపీని ఆహ్వానించటం, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ బీజేపీ
నిస్సహాయతను ప్రకటించిన అనంతరం శివసేనకు అవకాశం ఇవ్వటం.. అవసరమైన బలాన్ని సమకూర్చుకోటంలో విఫలమైన శివసేన మరింత సమయం కేటాయించాలనడం.. తాను దానిని తిరస్కరించటం గురించి గవర్నర్ తన నివేదికలో వివరించారు. శివసేన తరువాత ఎన్‌సీపీకి ఆహ్వానం పంపిస్తే ఆ పార్టీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్ని సమకూర్చుకునేందుకు మూడు రోజుల సమయం కావాలని అడగడం.. అది సాధ్యం కాదని చెప్పిన తరువాతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే సిఫారసు చేస్తున్నట్లు కొషియారీ తన నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి వివరించినట్లు తెలిసింది. బీజేపీ, శివసేన, ఎన్‌సీపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అదనపు సమయం అడిగారు.. అదనపు సమయం కేటాయిస్తే శాసనసభ్యుల కొనుగోళ్లకు దారితీస్తుందనే అనుమానంతో ఇందుకు తాను సమ్మతించలేదని గవర్నర్ వివరించినట్లు తెలిసింది.
*చిత్రం... ముంబయిలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్న ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్