జాతీయ వార్తలు

గురునానక్ బోధనలను అనుసరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తాన్‌పూర్ లోధి (పంజాబ్), నవంబర్ 12: సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ ఎల్లవేళలా మన హృదయాలలో నివసిస్తుంటారని పేర్కొంటూ, ప్రజలు ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని, సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు పాటుపడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. గురు నానక్ దేవ్ 550వ జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు రాష్ట్రపతి కోవింద్ తన సతీమణి సవితతో కలిసి మంగళవారం ఉదయం పంజాబ్‌లోని కాపుర్తల జిల్లాలో గల పవిత్ర పట్టణమయిన సుల్తాన్‌పూర్ లోధికి చేరుకున్నారు. పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆయన సతీమణి ప్రిణీత్ కౌర్ రాష్టప్రతి దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్టప్రతి దంపతులు నేరుగా చరిత్రాత్మక గురుద్వారా బేర్ సాహిబ్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి దంపతులు గురు నానక్ దేవ్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. తరువాత రాష్టప్రతి పంజాబ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురు నానక్ జయంతి ఉత్సవాల వేదికపైకి చేరుకున్నారు. వేదికపై ఆయన ఒక జ్ఞాపికను, సిక్కులు సంప్రదాయబద్ధంగా ధరించే ఖడ్గాన్ని స్వీకరించి, ఘన సత్కారం పొందారు. ఈ సందర్భంగా రాష్టప్రతి మాట్లాడుతూ తొలుత కార్యక్రమానికి హాజరయిన వారందరికీ ‘సత్ శ్రీ అకాల్’ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘గురు నానక్ దేవ్ మన హృదయాలలో నివసిస్తున్నారు. ఆయన మనకు ఉమ్మడి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి. ఆయన మొత్తం మానవాళికి సన్మార్గం చూపే జ్యోతి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘గురు నానక్ దేవ్ బోధించిన ఆదర్శాలను ఆచరించడం, సామాజిక అసమానత్వాలను రూపుమాపే దిశగా పాటుపడటం మనందరి కర్తవ్యం’ అని ఆయన అన్నారు. గురు నానక్ దేవ్ తన బోధనల ద్వారా విజ్ఞాన కాంతులను వెదజల్లారని, ‘సర్బత్ దా భలా’ (అందరి సంక్షేమంగా ఉండాలి) అని ఉపదేశించారని, అసమానత్వం, కులం, జాతి వంటి భావనలను అధిగమించి ఎదగాలని పిలుపునిచ్చారని కోవింద్ పేర్కొన్నారు. ‘గురు నానక్ దేవ్ జీవితం, బోధనలు మొత్తం మానవాళికి ప్రేమ, వాత్సల్యం, జాలి, కరుణ, సౌభ్రాతృత్వ సందేశాలను ఇస్తుంటాయి’ అని రాష్ట్రపతి అన్నారు. గురు నానక్ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గల భారతీయులకు నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని కోవింద్ అన్నారు.