జాతీయ వార్తలు

రూ. 3.60 లక్షల కోట్లతో 14.60 కోట్ల ఇళ్లకు కుళాయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 14.60 కోట్ల ఇళ్లకు 3.60 లక్షల కోట్ల వ్యయంతో నీటి కుళాయిలు ఇవ్వనున్నట్టు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో తాగునీటి వనరుల పథకాలను ఆయన సమీక్షించారు. ఈ సమీక్షకు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ సహా పుదుచ్చేరి రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ సూచించినట్టు వెనువెంటనే అన్నిరాష్ట్రాలూ జల జీవన్ మిషన్‌ను ప్రారంభించాలని పేర్కొన్నారు. మిషన్ ప్రారంభించిన తర్వాత తొలి ఆరు నెలలూ ఎంతో కీలకమని అన్నారు. వివిధ రాష్ట్రాలు అమలుచేస్తున్న తాగునీటి పథకాలు, వాటి తీరుతెన్నులు, భవిష్యత్‌లో తీసుకోవల్సిన చర్యలను రాష్ట్రాల వారీ మంత్రి సమీక్షించారు. జల జీవన్ మిషన్ అమలుకు తీసుకోవల్సిన చర్యలను కేంద్ర జలవనరుల కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ వివరించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, స్వచ్ఛ భారత్ పథకాల అమలు ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారు. ఇంటింటికీ నీటి కుళాయిల ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నిధులు నేరుగా అందించేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆయన అధికారులకు చెప్పారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ జల జీవన్ మిషన్ గురించి వెల్లడించారని, 2024 నాటికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటికీ రక్షిత తాగునీటి కుళాయిలు సమకూర్చడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలుచేయాల్సి ఉందని అన్నారు. ఏపీ జలవనరుల మంత్రి పీ అనిల్‌కుమార్క, కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప, తెలంగాణ నుండి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా 120 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా లబ్దిదారులతోనూ ద్వైపాక్షిక సమావేశాలను దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో నిర్వహించినట్టు మంత్రి ఎఈ సందర్భంగా చెప్పారు.

*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్