జాతీయ వార్తలు

ఆర్టీసీ సమ్మెను పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: ఆర్టీసీ సమ్మెను పరిష్కరించకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ డివైఎఫ్‌ఐ తెలంగాణ కమిటీ ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టింది. డివైఎఫ్‌ఐ కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు చేరుకోగానే, పోలీసులు అడ్డుకోవడంతో గేటుముందే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎం.విప్లవకుమార్ మాట్లాడుతూ 37 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని అన్నారు. వేలాది మంది కార్మికులు సమ్మె ప్రారంభించి ఇన్ని రోజులైనా స్పందించని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరింపజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ధర్నా జరుగుతున్న సమయంలో అక్కడకు కాన్వాయిలో చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కారు దిగి వచ్చి దర్నానుద్దేశించి మాట్లాడడానికి నిరాకరించారు. డివైఎఫ్‌ఐ కార్యకర్తలతో మాట్లాడుతూ మంచి పని చేస్తున్నారని, ఆర్టీసీ సమ్మెకు తమ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు ఎం.విప్లవకుమార్, జీ.రామన్న, ఉపాధ్యక్షులు బి.సాంబశివ, డి.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.