జాతీయ వార్తలు

ప్రజలందరూ హ్యాపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు చారిత్మ్రాకమైందని, దేశ ప్రజలందరూ తీర్పును స్వాగతిస్తున్నారని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పుతో పౌరులందరూ శాంతియుతంగా మెలుగుతున్నారని సోమవారం ఇక్కడ అన్నారు. దేశమంతటా సామరస్య పూరిత వాతావరణమే కనిపిస్తోందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పేర్కొన్నారు. ఇదంతా చూస్తే సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అందరూ అందరూ స్వాగతిస్తున్నట్టేని ఆయన తెలిపారు. సోమవారం ఇక్కడ జరిగిన ఓ అంతర్జాతీయ మహిళా సదస్సులో రవిశంకర్ మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. శనివారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని ఆయన వ్యాఖ్యానించారు. మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలివ్వడం ముదావహమని ఆయన చెప్పారు.‘అయోధ్య స్థల వివాదం ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉంది. రెండు వర్గాల మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. అంతే కాదు దేశంలోని మతసామరస్యం, స్నేహానికి అవరోధంగానే ఉంటూ వచ్చింది. ఇప్పుడా పరిస్థితి తొలగిపోయింది. అంతా సజావుగా సాగుతుంది’అని ఆయన అన్నారు. ‘ ఇలాంటి పరిష్కారానే్న 2003లోనే నేను సూచించాను. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం నుంచి తీర్పు వెలువడింది. ఏది ఏమైనా మంచే జరిగింది’అని రవిశంకర్ చెప్పారు. అయోధ్యలో స్థల వివాదం పరిష్కారానికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తుల కమిటీలో రవిశంకర్ ఒకరు.
*చిత్రం...ఆధ్యాత్మిక గురువు రవిశంకర్