జాతీయ వార్తలు

అయోధ్య తీర్పుతో ఉపవాస దీక్షకు స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జబల్‌పూర్, నవంబర్ 11: అయోధ్య వివాదానికి సుప్రీం కోర్టు తెరదించడంతో 81 ఏళ్ల ఉర్మిళా చతుర్వేది ఆనందానికి అవధుల్లేవు. 54 ఏళ్లప్పుడు అంటే 27 ఏళ్ల క్రితం ఆమె ఉపవాసదీక్ష బూనారు. 1992 నుంచి కేవలం పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దశాబ్దాల నాటి అయోధ్య భూవివాదం ముగియడంతో ఇప్పుడు రోజువారీ ఆహారం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఉర్మిళ కుమారుడు వెల్లడించాడు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం రామమందిరానికి అప్పగిస్తూ రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఇచ్చింది. అలాగే అయోధ్యలోనే మసీదు నిర్మించుకునేందుకు సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలం ఇవ్వాలని సీజేఐ రంజన్ గొగోయ్ సారధ్యంలోని ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం కోర్టు తీర్పుతో 81 ఏళ్ల ఉర్మిళా చుతుర్వేది సంతోషం వ్యక్తం చేసింది. ఉపవాస దీక్షకు విరమించుకుంటున్నట్టు ప్రకటించింది. అలాగే సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయాలని కుటుంబ సభ్యులను ఆమె కోరింది. తన తల్లి 27 ఏళ్లుగా పండ్లూ, పాలు మాత్రమే తీసుకుంటున్నారని ఆమె కుమారుడు అమిత్ చతుర్వేది వెల్లడించాడు. ‘నా తల్లి శ్రీరామచంద్రుడి భక్తురాలు. అయోధ్య వివాదానాకి ఎప్పటికైనా పరిష్కారం దొరక్కపోతుందా ఇంత కాలం వేచిచూసింది. కోర్టు తీర్పుతో ఎంతో సంతోషంగా ఉంది’ అని అతడు పేర్కొన్నాడు. సంస్కృత ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమెను దీక్ష విరమించాలని కుటుంబ సభ్యులు, బంధువులు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా వినలేదు. మొత్తానికి ఆమె కోరిక నెరవేరడంతో ఉపవాస దీక్ష విరమించనుంది.
కాగా తన తల్లికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదన్న అమిత్‌‘ ఉదయపాన్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉర్మిళతో దీక్ష విరమింపచేయిస్తాం’అని ప్రకటించాడు.