జాతీయ వార్తలు

లతా మంగేష్కర్‌కు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 11: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను బ్రీచ్ కెన్డీ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆసుపత్రి డాక్టర్లు ఆమెను ఇంటెన్సిస్ కేర్ యూనిట్ (ఐసీయు)లో చికిత్స ప్రారంభించారు. సెప్టెంబర్ 28న ఆమె 90 సంవత్సరంలో అడుగు పెట్టారు. ఆదివారం అర్థరాత్రి దాటక అంటే సోమవారం 2 గంటల ప్రాంతంలో ఆమె శ్వాస తీసుకోవడంలో పడుతున్న ఇబ్బందిని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే లతామంగేష్క్‌ర్‌కు జ్వరం వచ్చిన కారణంగానే ఆసుపత్రిలో చేర్చించామని, కోలుకుంటున్నారని ఆమె మేన కోడలు రచనా షా తెలిపారు.
ఎవరూ ఆందోళన చెందవద్దని, సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు పోస్ట్ చేయకూడదని ఆమె కోరారు.