జాతీయ వార్తలు

న్యాస్ డిజైన్ ప్రకారమే ఆలయ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్/అహ్మదాబాద్, నవంబర్ 9: అయోధ్యలో రామ జన్మభూమి న్యాస్ రూపొందించే డిజైన్ ప్రకారమే ఆలయ నిర్మాణం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ కొక్జి తెలిపారు. శనివారం సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత విష్ణు సదాశివ కొక్జి మీడియాతో మాట్లాడుతూ తీర్పును స్వాగతించారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వివాదానికి తెర పడడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం అన్ని వర్గాలకూ ఆమోద యోగ్యంగా తీర్పునిచ్చిందని ఆయన తెలిపారు. ఈ తీర్పు ఏ ఒక్కరికి అనుకూలంగానో, మరొకరికి వ్యతిరేకంగానో వచ్చిందని భావించరాదన్నారు. ఎవరూ ఓడిపోలేదన్నారు. సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సుప్రీం తీర్పునివ్వడం హర్షణీయమని అన్నారు. 2024 సంవత్సరంలోగా ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందని ఆశిస్తున్నానని విష్ణు సదాశివ కొక్జి తెలిపారు.