జాతీయ వార్తలు

వాస్తవం, న్యాయం పరిరక్షించబడ్డాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: అయోధ్యలోని భూ వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో వాస్తవం, న్యాయం పరిరక్షించబడ్డాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఈ తీర్పు ఏ ఒక్కరి విజయంగానో, ఓటమిగానో చూడరాదని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ తీర్పును స్వాగతిస్తున్నదన్నారు. అదేవిధంగా ప్రజల మనోభావాలను అనుకూలంగా తీర్పు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్ళుగా ఉన్న భూ వివాదానికి సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం సరైన విధంగా ముగింపు పలికిందన్నారు. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పునివ్వడం గొప్ప విషయమని ఆయన తెలిపారు. ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు రావాలని కోరుకున్నామని మోహన్ భగవత్ చెప్పారు.