జాతీయ వార్తలు

తీర్పు నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: దశాబ్దాలుగా దేశ రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసిన అత్యంత సునిశితమైన, ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అయోధ్య కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం శనివారం చారిత్రక తీర్పును వెలువరించబోతున్నది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారధ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం దాదాపు 40 రోజుల పాటు దైనందిన విచారణను పూర్తి చేసి, గత నెల 16న తీర్పును రిజర్వ్ చేసింది. ఆ కీలక ఘట్టం ఉదయం 10.30 నిమిషాలకు ఆవిష్కృతం కాబోతోన్నది. ఇది అన్ని విధాలుగా సునిశితమైన అంశం కాబట్టి సుప్రీం తీర్పు ఎలా ఉన్నా, ఎలాంటి శాంతి-్భద్రతల సమస్యకు తావు లేని రీతిలో దేశవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ వివాదానికి కేంద్రమైన అయోధ్యలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. దాదాపు 4 వేల మందితో కూడిన పారా మిలటరీ దళాలను ఉత్తర్ ప్రదేశ్‌కు తరలించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొవడానికి వీలుగా ఇటు లక్నోలోనూ, అటు అయోధ్యలోనూ రెండు హెలికాప్టర్లను సంసిద్ధం చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా లక్నోలో రాష్ట్ర స్థాయి కంట్రోలు రూంను ఏర్పాటు చేశారు. రైల్వే పోలీసులు కూడా అన్ని జోన్లకు ఏడు పేజీల మార్గనిర్ధేశన నియామవళిని జారీ చేశారు. రైల్వే రక్షణ దళాలకు చెందిన జవాన్ల సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం వీరిని రైళ్ళ భద్రతకు వినియోగించింది. ఎలాంటి శాంతి విఘాతటక చర్యలకు పాల్పడవద్దని హిందు-ముస్లిం సంస్థ లు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. తీర్పు ఎలా ఉన్నా దానిని శిరసావహించాలంటూ అన్ని రాజకీయ పార్టీలు, మత సంస్థలు ప్రజలను కోరాయి. మరోపక్క కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. శనివారం నుంచి సోమవారం వరకు అన్ని విద్యా సంస్థలకు, శిక్షణా కేంద్రాలకు సెలవు ప్రకటించారు.
సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలు ముస్లిం మత నాయకులు మేధావులతో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి ఇంట్లో సమావేశమయ్యారు. అన్ని వర్గాల తీర్పును స్వాగతించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
చీఫ్ జస్టిస్ కీలక భేటీ
అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు- రామ జన్మభూమి వ్యవహారంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ శుక్రవారం తన చాంబర్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్ తివారీ, పోలీసు డైరెక్టర్ జనరల్ ఓం ప్రకాశ్ సింగ్‌తో కీలక భేటీ జరిపారు. యూపీలోని శాంతి భద్రతల పరిస్థితిపై చర్చించారు. రంజన్ గొగోయ్ ఆదేశం మేరకు సుప్రీం కోర్టుకు వచ్చిన రాజేంద్రకుమార్ తివారీ, ప్రకాశ్ సింగ్ దాదాపుగంటన్నర పాటు ఆయనతో ముఖాముఖి చర్చలు జరిపారు. సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వచ్చే వారం ఏదో రోజు అయోధ్యపై తీర్పును వెలువరించే అవకాశం ఉంది. తీర్పు వెలువడిన అనంతరం ఉత్తరప్రదేశ్‌తోపాటు దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో అల్లర్లు చెలరేగకుండా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి ఇది వరకే కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో రంజన్ గొగోయ్ శుక్రవారం తివారీ, ప్రకాశ్ సింగ్‌తో జరిపిన సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. యూపీలో ముఖ్యంగా అయోధ్యలో శాంతి భద్రతలను పరిస్థితిపై సమీక్షించారు. దీని కోసం గతంలో తీసుకున్న చర్యలు, ఎంత మంది పోలీసులను మొహరించారు? ఎక్కడెక్కడ మొహరించారు? అనే అంశాలపై గొగోయ్ ఇద్దరు సీనియర్ అధికారులను వాకబు చేశారు. ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను సమీక్షించటంతోపాటు ఇక మీదట తీసుకోవలసిన చర్యల గురించి కూడా రంజన్ గొగోయ్ విచారించినట్లు చెబుతున్నారు. సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య నగరంలోని వివాదాస్పద బాబ్రీ మసీదు- రామజన్మ భూమికి సంబంధించిన 2.77 ఎకరాల భూమికి యజమాని ఎవరనే అంశంపై తీర్పు ఇవ్వనుంది. అలహాబాద్ హైకోర్టు 2010 ఆక్టోబర్ 1న వివాదాస్పద స్థలంపై తీర్పునిస్తూ 2.77 ఎకరాల భూమికి హిందువులు, ముస్లింలు, ఇద్దరు సంయుక్త యజమానులని చెప్పటం తెలిసిందే. న్యాయమూర్తులు ఎస్‌యూ ఖాన్, సుధీర్ అగర్వాల్, డీవీ శర్మతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం 2:1 నిష్పత్తిలో తీర్పు ఇస్తూ 2.77 ఎకరాల భూమిని మూడు పార్టీలకు పంచింది. మూడింట ఒక వంతు భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు, మరో వంతు నిర్మోహీ అఖాడా, ఇంకో వంతు రాం లల్లాకు కేటాయించింది. హైకోర్టు ఎనిమిది వేల పేజీల తీర్పులో వివాదాస్పద భూమిలో రాంలల్లా, ఇతర దేవతా విగ్రహాలున్న భూమి హిందువులకు చెందుతుందని చెప్పింది. నిర్మోహీ అఖాడాకు రాం చబూత్రా (అరుగు), సీతారసోయి (వంటగది)ని ఇచ్చిన హైకోర్టు మిగతా భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించింది. 2.77 ఎకరాల భూమిని మూడు భాగాలుగా చేసినా రాంలల్లా విగ్రహం మాత్రం ఉన్నచోటే ఉంటుంది తప్ప దానిని అక్కడి నుంచి జరపటం జరగదని కూడా ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విస్పష్టంగా తీర్పులో స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. హిందు సంస్థలు కూడా సుప్రీం కోర్టు తలుపులు తట్టాయి. రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వచ్చే వారం ఇచ్చే తీర్పులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును బలపరుస్తుందా? మార్పులు, చేర్పులు చేస్తుందా? లేక అలహాబాద్ హైకోర్టు తీర్పుకు భిన్నమైన తీర్పు ఇస్తుందా? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.