జాతీయ వార్తలు

ఫలితాలు నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశమంతా ఎదురుచూస్తున్న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు గురువారం వెలువడనుంది. ఈనెల 21న జరిగిన పోలింగ్‌లో మహారాష్టల్రో 60.05 శాతం ఓట్లు నమోదయ్యాయి. 2014 ఎన్నికల్లో 63.08 శాతం పోలింగ్ ఉండగా, ఈసారి కొంతమేర తగ్గింది. హర్యానాలో పోలింగ్ శాతం ఏకంగా 10 శాతం పడిపోవడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 76.54గా ఉన్న పోలింగ్ ఈసారి 65 శాతానికి పరిమితమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా కొనసాగుతోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. మహారాష్టల్రో బీజేపీ-శివసేన కూటమికి 211, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి 64 చొప్పున సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. కాగా, హర్యానాలో 90 సీట్లకు గాను 66 సీట్లను బీజేపీ కొల్లగొడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్‌కు 14 సీట్లు రావచ్చునని అంచనా వేస్తున్నారు. జమ్మూకాశ్మీర్‌లో 370 అధికరణ రద్దు తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడంతో ప్రజాశక్తి ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. కౌంటింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల్లోగా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.