జాతీయ వార్తలు

న్యాయం కోసం పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, అక్టోబర్ 23: బిషప్ ఫ్రాంకో ములాక్కల్ తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తున్న ఓ ‘నన్’ బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె వినతిపత్రం సమర్పించింది. అంతేకాకుండా రాష్ట్ర మహిళా కమిషన్‌ను, జాతీయ మహిళా కమిషన్‌ను కూడా ఆమె కలిసి తన గోడును వినిపించుకుంది. సోషల్ మీడియా మాధ్యమంగా కూడా బిషప్ ఫ్రాంకోపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసింది. కాగా, ‘నన్’ విజ్ఞప్తిపై కేరళ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. వెంటనే సదరు బిషప్‌పై కేసు నమోదు చేసి, సత్వర విచారణ చేపట్టాలని సైబర్ వింగ్ అధికారులను ఆదేశించింది. ఈ సంఘటన అత్యంత హేయమైనదిగా అభివర్ణించిన మహిళా కమిషన్ 10 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని అధికారులకు స్పష్టం చేసింది. కమిషన్ చైర్‌పర్సన్ ఎం.సీ.జోస్ ఫైన్ విలేఖరులతో మాట్లాడుతూ చర్చిలో సేవలు అందిస్తున్న ‘నన్’పై బిషప్ అత్యాచారానికి ఒడిగట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. దోషులు ఎవరైనా, ఎంతటి స్థానంలో ఉన్నా ఒదిలిపెట్టేది లేదని ఆమె తేల్చిచెప్పారు. బిషప్‌ను అపఖ్యాతిపాలు చేయడానికి, బ్లాక్‌మెయిల్ చేయడానికి బాధితురాలిగా చెప్పుకుంటున్న ‘నన్’ ప్రయత్నిస్తోందని బిషప్ మద్దతుదారులు చేస్తున్న వాదనలను ఆమె ఖండించారు.
నిజానిజాలు నిర్థారణ కాకుండానే బిషప్‌ను నిర్దోషిగా భావించలేమని ఆమె చెప్పారు. సోషల్ మీడియాలో ‘నన్’ ఉదంతం సంచలనం రేపిన విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని తెలిపారు. బిషప్, చర్చి సిబ్బంది, మద్దతుదారులు తనను మానసికంగా వేధించడమే కాకుండా భయాందోళనకు గురిచేస్తున్నారని బాధితురాలు వాపోతున్నట్టు ఆమె తెలిపారు.