జాతీయ వార్తలు

బోఫోర్సుతో పాక్ పనిపట్టాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారత సైన్యం బోఫోర్స్ ఫిరంగులతో అక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలు, వారి సంరక్షకులపై జరిపిన దాడుల్లో సుమారు పది మంది పాకిస్తాన్ సైనికులు, అంతే సంఖ్యలో ఇస్లామిక్ ఉగ్రవాదులు మరణించారని
భారత సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ తెలిపారు. బిపిన్ రావత్ ఆదివారం రాత్రి కొందరు విలేకరులతో మాట్లాడుతూ పాకిస్తాన్ సైన్యం పౌర ప్రాంతాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం బోఫోర్స్ ఫిరంగులతో దాడులు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని నీలం లోయ, ఇతర ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలు ఏర్పాటు చేయటంతోపాటు వారికి భద్రత కల్పిస్తోంది, అందుకే భారత సైన్యం జరిపిన ఫిరంగుల దాడిలో ఇస్లామిక్ ఉగ్రవాదులతోపాటు పాకిస్తాన్ సైనికులు కూడా మరణించారని ఆయన చెప్పారు. భారత సైన్యం జరిపిన బోపోర్స్ దాడుల్లో తమ అంచనా కంటే ఎక్కువ మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ సైనికులు మరణించి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం, ఇస్లామిక్ ఉగ్రవాదులు రేడియో వౌనం పాటిస్తుండటం వలన తమకు పూర్తి సమాచారం అందటం లేదని రావత్ చెప్పారు. తమకు జరిగిన నష్టాలను దాచి పెట్టేందుకే పాకిస్తాన్ సైన్యం, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు రేడియో వౌనం పాటిస్తున్నాయని బిపిన్ రావత్ చెప్పారు.

*చిత్రం... ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్