జాతీయ వార్తలు

భారత్ ప్రతీకార దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌పై మరోసారి భారత్ ఫిరంగి గుళ్ళు కురిపించింది. బాలాకోట్ దాడి తర్వాత అంతే ప్రాధాన్యత కలిగిన స్థాయిలో
ఆక్రమిత కాశ్మీర్‌లోని నాలుగు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు, అంతే సంఖ్యలో
పాక్ సైనికులూ మరణించారు. దాడి తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. తమదైన శైలిలో పాక్ ఈ దాడిని ఒట్టి కల్పన అంటూ ఖండించింది. నిజాన్ని నిగ్గు తేలుస్తామని ప్రకటించింది. భారత దౌత్యవేత్తకు సమన్లు పంపి సంజాయిషీ కోరింది.
*
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: పాకిస్తాన్ సైన్యం మన దేశ సరిహద్దుల్లోని పౌర ప్రాంతాలపై జరుపుతున్న కాల్పులకు ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలపై ఫిరంగులతో దాడులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్ సైన్యానికి గట్టిగా బుద్ధి చెప్పాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాలు జారీ చేయడమే కాకుండా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించటంతోపాటు పాకిస్తాన్ సైన్యానికి భారత సైన్యం ఇస్తున్న ప్రతి జవాబును కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. భారత సైన్యం కురిపించిన ఫిరంగుల గుళ్ల మూలంగా ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మరణించి పలువురు గాయపడగా
నాలుగు ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసమైనట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ సైన్యం గత రాత్రి కుప్వారా క్షేత్రంలోని తాంగ్దార్ ప్రాంతంపై ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులతోపాటు ఒక పౌరుడు మరణించారు. పలు ఇళ్లు ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. పాకిస్తాన్ సైన్యం జరిపిన ఈ దురాగతానికి ప్రతీకారంగా భారత సైన్యం కుప్వారా క్షేత్రంలోని తాంగ్దార్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న నీలం లోయలోని ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలపై పెద్ద ఎత్తున ఫిరంగులతో దాడి చేసింది. పాకిస్తాన్ సైన్యం నీలం లోయలో పలు చోట్ల ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలను నిర్వహిస్తోంది. పాకిస్తాన్ సైన్యం ముఖ్యంగా పాకిస్తాన్ గూడచార సంస్థ ఐఎస్‌ఐ అవకాశం లభించిన ప్రతిసారి నీలం లోయలోని శిబిరాల నుండి ఇస్లామిక్ ఉగ్రవాదులను భారత్‌లోకి పంపిస్తోంది. భారత సైన్యం నీలం లోయలోని పాకిస్తాన్ సైనిక పోస్టులపై కూడా బాంబుల వర్షం కురిపిస్తోందని సైనిక వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేస్తే సరిపోదు, దీనితోపాటు ఇస్లామిక్ ఉగ్రవాదులను భారత్‌లోకి అక్రమంగా చొప్పించేందుకు కుట్రలు చేస్తున్న పాకిస్తాన్ సైనిక పోస్టులు, కేంద్రాలపై ఫిరంగి దాడులు చేస్తున్నామని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ సైన్యంతోపాటు పాకిస్తాన్ పాలకులకు కూడా స్పష్టమైన హెచ్చరిక పంపించేందుకే భారత సైన్యం ఫిరంగులతో దాడులు చేస్తోందని రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫిరంగి దాడులు మెరుపుదాడులు, బాల్‌కోట్‌పై జరిపిన విమాన దాడుల కంటే కొంత తక్కువ స్థాయి దాడులని వారంటున్నారు. భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లని పాకిస్తాన్ సైన్యానికి చెందిన శతఘు్నలు, ఫిరంగుల మోహరింపుపై దాడులు జరుపుతోందని వారు తెలిపారు. పాకిస్తాన్ దాచి ఉంచిన ఫిరంగుల మోహరింపు గురించి తమకు తెలుసుననే సందేశాన్ని పంపించేందుకు వీటిపై భారత సైన్యం బాంబులు కురిపిస్తున్నట్లు రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన ప్రతిసారి ఈ ఫిరంగుల మోహరింపుపై భారత సైన్యం దాడులు జరుపుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలాఖరు వరకు 2050 సార్లు కవ్వింపు లేకుండా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇరవై ఒక్క మంది మరణించారని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. జమ్ము-కాశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా ఆయుధాలు, బాంబులు పంపించటం వంటి పనులు కూడా చేయటం తెలిసిందే. భారత్ జరిపిన ప్రతీకార దాడుల్లో ఎంత మంది పాక్ ఉగ్రవాదులు మరణించారన్న దానిపై భిన్న కథనాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల కథనం ప్రకారం భారత్ జరిపిన భారీ ఫిరంగి దాడుల్లో 20 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కూడా ఉందని ఈ వర్గాలు తెలిపారు. పాకిస్తాన్ ఈ తరహాలో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడితే తీవ్ర స్థాయిలో ప్రతికార దాడులు చేసే హక్కు భారత్‌కు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. కాశ్మీర్‌లో 370-అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడానికి జరిపిన లక్షిత దాడుల తర్వాత భారత సైన్యం ఇంత భారీ స్థాయిలో ప్రతికార చర్యలకు పాల్పడడం ఇదే మొదటి సారి.
*చిత్రం... ఆక్రమిత కాశ్మీర్‌లోని నీలం వ్యాలీ ప్రాంతంలో భారత్ జరిపిన దాడులకు ధ్వంసమైన ఉగ్ర శిబిరాలు