జాతీయ వార్తలు

నెల్లూరులో అల్యూమినియం ప్లాంట్‌కు త్వరలో శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: నెల్లూరులో అల్యూమినియం అల్లాయ్ ప్లాంట్ నిర్మించేందుకు త్వరలోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకు తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఉప రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి వెంకయ్య నాయుడుతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. నెల్లూరులో అల్యూమినియం అల్లాయ్ ప్లాంట్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని వెంకయ్యనాయుడు ఈ సంధర్భంగా సూచించగా త్వరలోనే శంకుస్థాపన చేసి నిర్మాణం పనులు ప్రారంభిస్తామని రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో ఉత్కర్ష అల్యూమినియం ధాతు (అల్లాయ్) నిగమ్ లిమిటెడ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని కొడలువూరు మండలం, బొడ్డువారిపాలెంలోని పారిశ్రామిక వాడలో ఈ ప్లాంటును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలోని మిధాని, నాల్కో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టాల్సి ఉంది. గత ఆగస్టు 26న ప్లాంటు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా, ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్‌జేట్లి మరణంతో ఈ శంకుస్థాపన వాయిదా పడింది.

*చిత్రం... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలుసుకున్న దృశ్యం