జాతీయ వార్తలు

ఆతిథ్య రంగంలో ఖైదీలకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఢిల్లీ నగరంలోని వివిధ జైళ్లలో ఉన్న వెయ్యి మందికి పైగా ఖైదీలు ఏడాదిలోగానే ఆతిథ్య రంగంలో శిక్షణ పొందనున్నారు. ఖైదీలు తమ శిక్షాకాలాన్ని ముగించుకొని జైలునుంచి విడుదలయిన తరువాత కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి దోహదపడాలనే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమం కింద వారికి ఆతిథ్య రంగంలో శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. జైళ్ల శాఖ, ‘ప్రైమ్‌రియో’ అనే స్వచ్ఛంద సంస్థ మధ్య సెప్టెంబర్ మొదటి వారంలో దీనికి సంబంధించి ఒక అవగాహనా ఒప్పందం కుదిరిందని జైళ్ల శాఖలోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పటికే అవగాహనా ఒప్పందంపై సంతకాలు అయినందున సమీప భవిష్యత్తులోనే శిక్షణ తరగతులు మొదలవుతాయని ఆ అధికారి వివరించారు. ఖైదీలు జైలునుంచి విడుదలయిన తరువాత వారు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సహాయ పడవలసిన బాధ్యత జైలు అధికారులపై ఉందని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ అన్నారు. ‘జైలు ఆవరణలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ రెండు నుంచి మూడు గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయి. ఈ కార్యక్రమం కింద 1,020 మంది ఖైదీలకు శిక్షణ ఇవ్వాలనేది మా లక్ష్యం. మధ్యాహ్న భోజనానికి ముందు, తరువాత బ్యాచ్‌ల వారీగా శిక్షణ తరగతులు జరుగుతాయి. ఒక్కో బ్యాచ్‌లో 30 మంది ఖైదీలు ఉంటారు’ అని గోయెల్ తెలిపారు. ఢిల్లీ నగరంలోని వివిధ జైళ్లలో 16వేల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. స్టీవార్డ్ సర్వీసులో మూడు నెలలు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, విడుదలయిన తరువాత 70 మంది శిక్షణ పొందిన ఖైదీలు ఉపాధి అవకాశాలను పొందుతారని ఆయన అన్నారు.