జాతీయ వార్తలు

పుదుచ్చేరి గవర్నర్‌పై సీఎం గరం గరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదుచ్చేరి, అక్టోబర్ 19: పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీ. నారాయణ స్వామి ఆరోపించారు. ఎటువంటి కారణం లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని కామరాజ్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 21న ఉప ఎన్నిక జరగనున్నది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా శనివారం కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీకి నారాయణ స్వామి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రసంగిస్తూ గవర్నర్ బేడీ ఎవరి నుంచైనా ఫిర్యాదులు, విన్నపాలు స్వీకరించినట్లయితే వాటిని ప్రభుత్వానికి లేదా సంబంధిత మంత్రులకు పంపించాలే తప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదన్నారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ బేడీ దృష్టికి ఎటువంటి అంశం వచ్చినా దానిని తమకు ప్రభుత్వానికి పంపించడం ఆమె బాధ్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. కానీ కిరణ్ బేడీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ నియమ, నిబంధనలను, ఆచారాలను ఉల్లంఘిస్తున్నారని ఆయన విమర్శించారు. డీఎంకే చీఫ్‌పై లెఫ్ట్‌నెంట్ గవర్నర్ బేడీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. స్టాలిన్ ఎన్నికల ప్రచారం సమయంలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌పై వ్యాఖ్యానించినట్లుగానే ఆమె ప్రవరిస్తున్నారని ఆయన విమర్శించారు.