జాతీయ వార్తలు

సయోధ్యకు వక్ఫ్ బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : కాశీ, మధురతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న మసీదులకు పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తే అయోధ్య-బాబ్రీ మసీదు భూమిపై తమ హక్కును వదులుకుంటామని సున్ని వక్ఫ్ బోర్డు సుప్రీం కోర్టుకు చెప్పినట్లు తెలిసింది. సున్ని వక్ఫ్ బోర్డు తరపున సుప్రీం కోర్టులో వాదిస్తున్న ప్రమఖ న్యాయవాది రాజీవ్ ధావన్ ద్వారా ఈ ప్రతిపాదనను సుప్రీం కోర్టు శ్రీశ్రీశ్రీ రవిశంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ సంఘానికి అందజేసినట్లు చెబుతున్నారు. అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం పరిష్కారం కోసం ఒక ప్రతిపాదనను సుప్రీం కోర్టు ముందుంచాం.. ఇతర వివరాలను వెల్లడించటం సాధ్యం కాదని సున్ని వక్ఫ్ బోర్టుకు చెందిన ఒక సీనియర్ నాయకుడు విలేఖరులకు చెప్పారు. సుప్రీం
కోర్టుకు అందజేసిన తమ పరిష్కార ప్రతిపాదనలోని అన్ని విషయాలను వెల్లడించటం సాధ్యం కాదు.. అయితే కాశీ, మధుర తదితర ప్రాంతాల్లో ఉన్న మసీదులు దురాక్రమణకు గురికాకుండా చూస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం హామీ ఇవ్వవలసి ఉంటుందని వారంటున్నారు. కాశీలోని విశ్వనాథాలయం, మధురలోని శ్రీకృష్ణ జన్మస్థానంలో కూడా పెద్ద మసీదులు ఉండటం తెలిసిందే. కాశీ, మధుర దేవాలయాల్లో సగం భాగం మసీదులుగా ఉన్నాయి. ముస్లిం పాలనలో ఈ దేవాలయాలు దురాక్రమణకు గురయ్యాయి, ఈ దురాక్రమణ కారణంగానే అక్కడ మసీదులు వెలిశాయన్నది హిందువుల వాదన. కాశీ, మధుర మరికొన్ని వివాదాస్పద ప్రాంతాల్లోని మసీదులకు పూర్తి రక్షణ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చే పక్షంలో అయోధ్య-బాబ్రీ మసీదు వివాదాస్పద భూమిని హిందువులకు కేటాయించేందుకు తమకు అభ్యంతరం లేదని సున్ని వక్ఫ్ బోర్డు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. హిందు, ముస్లింల మధ్య ఇకమీదట ఎలాంటి గొడవ ఉండకూడదనే ఆలోచనతోనే తామీ ప్రతిపాదన చేసినట్లు వారు చెబుతున్నారు. అయితే సున్ని వక్ఫ్ బోర్డులోని కొందరు సభ్యులు మాత్రమే ఈ మధ్యేమార్గాన్ని సమర్థిస్తున్నట్లు తెలిసింది.