జాతీయ వార్తలు

వృద్ధుల అనుభవం విలువ లేనిది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 16: పూర్తి కాలం జీవించిన వారి జీవితం ఎంతో గొప్ప విలువయినది. అది మనకు ఎంతో బోధిస్తుంది. ‘ఆంటీ సుధ, ఆంటీ రాధ’ అనే డాక్యుమెంటరీ తీసిన తనూజ చంద్ర చేసిన వ్యాఖ్యలివి. ప్రస్తుతం 80వ, 90వ పడిలో ఉన్న తన ఇద్దరు ఆంటీలు తమ జీవిత చరమాంకంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ఎలా ప్రశాంతంగా జీవిస్తున్నారు అనే విషయాన్ని వివరిస్తూ తనూజ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. ‘మరణం, అనారోగ్యం, వయసు పైబడటం, ఒంటరి జీవితం వంటి అంశాలన్నింటి గురించి ఈ చిత్రం ఎంతో సరళంగా ప్రస్తావించింది. ఈ ఇద్దరు మహిళలు తమ జీవితాన్ని ఎలా గడుపుతున్నారనే అంశాన్ని చిత్రంలో చర్చించడం జరిగింది. మనమంతా ఏదో ఒక రోజు మృత్యువును ఎదుర్కోబోతున్నవారమే’ అని తనూజ ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమాతో పాటు ప్రపంచమంతా కూడా ఒక వయసు వచ్చిన ప్రజలను పట్టించుకోవడం లేదనేదే తనను బాధిస్తోందని డైరెక్టర్ తనూజ పేర్కొన్నారు. ‘యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని కథలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ యువతను సంతోష పెట్టాలని అనుకుంటున్నారు. మరోవైపు, ప్రపంచమంతా యువత చుట్టూ అల్లుకుంటోంది. వృద్ధులు సమాజానికి చేసేది చాలా తక్కువ అనో, ఏమీ లేదనో విశ్వాసానికి సమాజం వచ్చింది. ఇది ఒక విషాదం. నా భావన దీనికి పూర్తిగా విరుద్ధం. ఒక వృద్ధ వ్యక్తికి ఎంతో అనుభవం ఉంటుంది. ఆ అనుభవం విలువ లేకుండా ఎలా పోతుంది? ఇలా అనుభవాన్ని విలువ లేనిదిగా పరిగణించడం విషాదం’ అని తనూజ అన్నారు. డైరెక్టర్ తనూజ తనకున్న నిర్దిష్టమయిన అభిప్రాయం మేరకే స్వయంగా తన ఇద్దరు ఆంటీలపైన ఒక చిత్రం తీశారు. గత సంవత్సరం తాను మొదటిసారి తన ప్రదేశానికి వెళ్లినప్పుడు ఒక వారం రోజుల్లో ఈ డాక్యుమెంటరీని తీశానని తనూజ చెప్పారు.