జాతీయ వార్తలు

ఎండుగడ్డి కాల్చడం ప్రమాదకరం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: పంట కోతలు ముగిసిన తర్వాత చేలల్లో ఉన్న ఎండుగడ్డిని కాల్చడం పర్యావరణానికి ప్రమాదకరం కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఏకే యాప్’ను బుధవారం విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఢిల్లీ కాలుష్యానికి, పంటల అనంతరం మిగిలిన గడ్డిని కాల్చడం ప్రధాన కారణం కాదే కాదని అన్నారు. దీనివల్ల 10 శాతం వరకు కాలుష్యం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదన సత్యదూరమని ఆయన స్పష్టం చేశారు. ఊహాజనిత ఆరోపణలు చేయవద్దని కేంద్రానికి ఆయన సూచించారు. ఈ విషయంపై వివరాలను పర్యావరణ పరిరక్షణ ఏజన్సీల నుంచి పొందవచ్చునని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. పరిసర ప్రాంతాల నుంచి కాలుష్యం ఢిల్లీపై ప్రభావం చూపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. పంట కోతల అనంతరం అక్కడి గడ్డి లేదా మొదళ్లను తొలగించడానికి ప్రత్యేక యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు.
*చిత్రం...న్యూఢిల్లీలో బుధవారం ‘ఏకే యాప్’ను విడుదల చేస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్