జాతీయ వార్తలు

నన్ను అవమానించారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత్తా: దుర్గ మాతా పూజ ఉత్సవం సందర్భంగా తనను అవమానించారని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా రాజ్యాంగ బద్ధంగా విధులు నిర్వహించే ప్రజా సేవకుడిని కాబట్టి తనకు విధుల నిర్వహణకు ఎవరూ ఆటంకం కలిగించలేరని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నిర్వహించిన కార్యక్రమంలో తనకు ప్రాధాన్యతనివ్వలేదని, వేదికపై దూరంగా సీటు కేటాయించారని గవర్నర్ ధన్‌కర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఉత్సవంలో తనకు దూరంగా సీటు కేటాయించడం వల్ల నాలుగు గంటల పాటు వేదికపై ఉన్నా తాను ఉత్సవాన్ని సరిగ్గా చూడలేకపోయానని ఆయన అన్నట్లు తెలిసింది. తనను ఆహ్వానించి ఇలా కనిపించకుండా చేసి అవమానించడం భావ్యమా? అని ఆయన ప్రశ్నించారు. దుర్గా మాతా ఉత్సవం సందర్భంగా జరిగిన అవమానంతో తీవ్రంగా బాధ పడ్డానని అన్నారు. తనకు జరిగిన అవమానంతో, పశ్చిమ బెంగాల్‌లోని ప్రతి ఒక్కరికీ జరిగినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అవమానాన్ని ప్రజలు జీర్ణించుకోలేరని అన్నారు. ప్రజా సేవలో నిమగ్నమైన తనను ఇలా అవమానించడం ద్వారా అడ్డుకోలేరన్నారు. పైగా తనకు ప్రచార ఆర్బాటం ఎక్కువ అంటూ టీఎంసీ నాయకులు వ్యాఖ్యానించడంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సేవకుడినైన తనకు ప్రచారం పట్ల ఆసక్తి లేదని గవర్నర్ ధన్‌కర్ తెలిపారు.

*చిత్రం... పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్